ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
ABN, Publish Date - Dec 01 , 2024 | 11:13 PM
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా పాలన సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు.
దండేపల్లి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘనాథ్ వెరబెల్లి అన్నారు. ఆదివారం మండల పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజా పాలన సంబురాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. రైతుబంధు ఇవ్వకుండా రైతులను మోసం చేశారన్నారు.
నిరుద్యోగ భృతి. ఇందిరమ్మ ఇండ్లు వంటి పలు హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం లేదని మండిపడ్డారు. వంద రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీ లను అమలు చేస్తామని హామీ ఇచ్చి యేడాది గడుస్తున్నా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని మండిప డ్డారు. పార్టీ అధ్యక్ష కార్యదర్శులు రాజన్న, రవిగౌడ్, శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణమూర్తి, రమణా రావు, మండల ఇన్ చార్జి గుండ ప్రభాకర్, నాయకులు ముత్తె సత్తయ్య, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - Dec 01 , 2024 | 11:13 PM