ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించే వరకు నిరసనలు

ABN, Publish Date - Oct 14 , 2024 | 10:40 PM

పెండింగ్‌లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కళాశాలల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలను చెల్లించే వరకు నేటి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అన్నారు.

మంచిర్యాల అర్బన్‌, అక్టోబర్‌ 14 : పెండింగ్‌లో ఉన్న కళాశాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించకపోవడంతో కళాశాలల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, బకాయిలను చెల్లించే వరకు నేటి నుంచి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలు చేపడుతామని ప్రైవేటు డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు అన్నారు.

సోమవారం పట్టణంలోని వివేకవర్థిని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించడం లేదని, దీంతో కళాశాలలను మూసివేసుకునే పరిస్థితి నెలకొందని, బకాయిలను విడుదల చేసే వరకు బంద్‌ పాటించడంతో పాటు నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు, అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2024 | 10:40 PM