ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలి

ABN, Publish Date - Oct 25 , 2024 | 10:52 PM

ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం ఆస్నాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి సందర్శించి హాజరు పట్టికలను, తరగతి గదలు, పరిసరాలను పరిశీలించారు.

చెన్నూరు, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ధులకు నాణ్యమైన విద్యాబోధన అందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం ఆస్నాద్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్‌రావుతో కలిసి సందర్శించి హాజరు పట్టికలను, తరగతి గదలు, పరిసరాలను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు మధ్యాహ్న భోజనం అందించాలన్నారు. ప్రతీ పాఠశాలలో విద్యుత్‌, తాగునీరు, మూత్రశాలలు, వంటశాల ప్రహరీ, ఇతర అన్ని వసతులను ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సూచించారు. నర్సరీని సందర్శించి మొక్కలను జాగ్రత్తగా పెంచి సకాలంలో అందించాలని సూచించారు. ఎంపీడీవో మోహన్‌, సంబంఽధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి

కోటపల్లి (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను సందర్శించారు. ముందుగా ఆసుపత్రిని సందర్శించిన ఆయన అక్కడి పరిసరాలు, మందుల నిల్వలు, రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని, సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వైద్యులు, సిబ్బంది విధుల్లో బాధ్యతగా వ్యవహరిస్తూ అందుబాటులో ఉండాలన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో కలెక్టర్‌ రిజిష్టర్‌లు, రికార్డులను పరిశీలించారు. వివిధ రకాల దరఖాస్తులను నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, ధరణి పోర్టల్‌లో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. నర్సరీని సందర్శించి మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కంపోస్టుషెడ్‌ను సందర్శించి తడి పొడి చెత్త నుంచి ఉపయోగపడే చెత్తను వేరు చేసి కంపోస్టు షెడ్‌కు తరలించి సేంద్రియ ఎరువుల తయారీకి వినియోగించాలన్నారు. గిరిజన సంక్షేమ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి అసంపూర్తిగా ఉన్న మరుగుదొడ్లను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, తెలంగాణ మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కళాశాలను సందర్శించి హాజరు పట్టికలు, తరగతి గదులు పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలన్నారు. షెడ్యూల్డు కులముల సంక్షేమ బాలుర వసతి గృహం శిథిలావస్థకు చేరుకుందని, చేపట్టాల్సిన పనులపై తెలుసుకున్నారు. మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీడీవో అందుబాటులో లేకపోవడం, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో హెచ్‌ఎం అందుబాటులో లేకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. తహసీల్దార్‌ మహేంద్రనాధ్‌, మండల పంచాయతీ అధికారి సత్యనారాయణ, మోడల్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ రాజశేఖర్‌, కేజీబీవీ ప్రత్యేకాధికారిణి హరిత, సంబంధిత అధికారులు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 10:52 PM