ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రజలు సంయమనం పాటించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 10:45 PM

ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారయత్నం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్మాత్మక ప్రాం తాల్లో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పర్యటించారు. ఆదివాసీ గూడాలైన కవ్వాల్‌, లోతొర్రె, దేవునిగూడ, కిష్టాపూర్‌ గ్రామాలను సంద ర్శించి ప్రజలు, యువత, ఆదివాసీ నాయకులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

జన్నారం, సెప్టెంబరు 5 : ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారయత్నం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్మాత్మక ప్రాం తాల్లో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ పర్యటించారు. ఆదివాసీ గూడాలైన కవ్వాల్‌, లోతొర్రె, దేవునిగూడ, కిష్టాపూర్‌ గ్రామాలను సంద ర్శించి ప్రజలు, యువత, ఆదివాసీ నాయకులతో మాట్లాడారు. ప్రజలు సంయమనం పాటించాలని, ఏదైనా సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకో లు చేస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకుని గొడవలు, అల్లర్లకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామన్నారు. సోషల్‌ మీడియాలో వదంతులను వ్యాప్తి చేసే వారిపై, గ్రూపు అడ్మిన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అటవీ శాఖ గెస్ట్‌హౌజ్‌లో ఆదివాసీ సంఘాల నాయకులతో మాట్లాడారు. జైనూరులో గిరిజన మహిళపై అత్యాచారం చేసిన నిందితునికి ఉరిశిక్ష విధించి బాధితురాలికి న్యాయం చేయాలని, మెరుగైన వైద్యం అందించాలని ఆదివాసీ నాయకులు సీపీకి విన్నవిం చారు. నిందితున్ని అరెస్టు చేశామని, ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు ద్వారా మూడు నెలల్లో శిక్ష పడేలా చూస్తామని, బాధితురాలుకు ప్రభుత్వం తరుపున న్యాయం జరిగేలా కృషి చేస్తామని సీపీ హామీ ఇచ్చారు. ఆర్‌ఐలు సంపత్‌, వామనమూర్తి, ఎస్‌ఐ రాజ వర్దన్‌, నాయకులు రాయిసిడం కాళీ, ధర్ము, గంగు పటేల్‌, రాజేష్‌, రాజ్‌కుమార్‌, అన్నావు, సుధాకర్‌ పాల్గొన్నారు.

దండేపల్లి: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సీపీ శ్రీనివాస్‌ అన్నారు. ఆదివాసి సం ఘాల బంద్‌ నేపథ్యంలో మ్యాదరిపేటలో పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని, సంయమనం పాటించాలన్నారు. సీఐ నరేందర్‌, ఎస్సై ఉదయ్‌కిరణ్‌ ఉన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 10:45 PM

Advertising
Advertising