విద్యార్థుల్లో పఠన సామర్ధ్యం పెంపొందించాలి
ABN, Publish Date - Oct 21 , 2024 | 10:51 PM
విద్యార్థుల్లో పఠన సామర్ధ్యం పెంపొందించాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం పడ్తన్‌పల్లి పాఠశాలలో రూమ్ టూ రీడ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో చదవడం అలవాటు చేయడం ద్వారా వారిని స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్టు, యుఎస్‌ఏఐడీ సహకారంతో ప్రతీ మండలంలో ఒక మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
హాజీపూర్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి) : విద్యార్థుల్లో పఠన సామర్ధ్యం పెంపొందించాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్ అన్నారు. సోమవారం పడ్తన్‌పల్లి పాఠశాలలో రూమ్ టూ రీడ్ ఇండియా వారు ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యార్థుల్లో చదవడం అలవాటు చేయడం ద్వారా వారిని స్వతంత్ర పాఠకులుగా తీర్చిదిద్దేందుకు జిల్లాలో రూమ్ టూ రీడ్ ఇండియా ట్రస్టు, యుఎస్‌ఏఐడీ సహకారంతో ప్రతీ మండలంలో ఒక మోడల్ లైబ్రరీలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ లైట్రరీలో కథ పుస్తకాలు, పఠన సామగ్రి ద్వారా విద్యా సామర్ధ్యాలు పెరుగుతాయన్నారు.
తల్లిదండ్రులు వారి ఇంటి వద్ద మంచి విలువలతో కూడిన విద్యాభ్యాసం అందించాలని తెలిపారు. డీఈవో యాదయ్య, రూమ్ టూ రీడ్ తెలంగాణ స్టేట్ మేనేజర్ నరసింహాచారి, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ దుర్గా ప్రసాద్, సమగ్ర శిక్ష సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు, ఎంఈవో పోచయ్య, ప్రధానోపాధ్యాయుడు హనుమాండ్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Updated Date - Oct 21 , 2024 | 10:51 PM