ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mancherial: ఆ ఆస్పత్రి నిర్వాకం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. వీళ్ల దోపిడీ మామూలుగా లేదుగా..

ABN, Publish Date - Dec 25 , 2024 | 12:39 PM

తెలంగాణ: మంచిర్యాలలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో కాసుల కోసం కక్కుర్తిపడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి సైతం చికిత్స చేస్తారు. లక్షలు రూపాయల బిల్ వేసి రోగి జేబులు గుల్ల చేయాలని చూస్తారు. అయితే వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యానికి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇస్తారు.

Hospital fraud in Mancherial

మంచిర్యాల: మానవత్వం మంటకలిసి పోతోంది. ప్రాణాలు నిలబెట్టాల్సిన కొంతమంది వైద్యులు కాసుల కోసం కక్కుర్తిపడుతున్నారు. మనుషుల ప్రాణాలు నిలబెట్టడం కంటే డబ్బే ప్రధానంగా పని చేస్తూ వైద్య వృత్తికి కళంకం తెస్తున్నారు. ఎంతో మంది డాక్టర్ల పేదలకు సేవ చేసేందుకు అతి తక్కువ ఫీజులు తీసుకుని వైద్యం చేస్తుంటే, మరికొంతమంది మాత్రం శవాలకు సైతం చికిత్స చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. దేవుడిలా కొలిచి దండం పెట్టాల్సిన స్థితి నుంచి కాలర్ పట్టుకుని ప్రశ్నించే దుస్థితి తెచ్చుకుంటున్నారు.


మంచిర్యాలలో ఠాగూర్ సినిమా సీన్ రిపీట్ అయ్యింది. ఈ సినిమాలో కాసుల కోసం కక్కుర్తిపడిన ఓ ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు చనిపోయిన వ్యక్తికి సైతం చికిత్స చేస్తారు. లక్షలు రూపాయల బిల్ వేసి రోగి జేబులు గుల్ల చేయాలని చూస్తారు. అయితే వైద్యులు, ఆస్పత్రి యాజమాన్యానికి కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి షాక్ ఇస్తారు. చనిపోయిన వ్యక్తికి ట్రీట్మెంట్ చేసిన వైద్యుల బాగోతాన్ని బట్టబయలు చేస్తారు. ఈ సీన్ ఠాగూర్ సినిమాకే హైలేట్‌గా నిలుస్తుంది.


అయితే తాజాగా అలాంటి ఘటనే మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చోటు చేసుకుంది. శ్రీనివాస్ అనే వ్యక్తి అనారోగ్యానికి గురికావడంతో కుటుంబసభ్యులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అతన్ని పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో జాయిన్ చేసుకుని చికిత్స ప్రారంభించారు. అయితే పరిస్థితి విషమించి బాధితుడు శ్రీనివాస్ మృతిచెందారు. అయినా విషయం తమకు చెప్పకుండా చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసినట్లు నటించారని రోగి తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.4.5 లక్షల బిల్లు వేసి షాక్ ఇచ్చారని రోగి బంధువులు చెప్తున్నారు. శ్రీనివాస్ చనిపోయి రెండ్రోజులు అవుతున్నా.. మృతదేహాన్ని మాత్రం అప్పగించడం లేదని వాపోతున్నారు. నగదు చెల్లిస్తేనే శవాన్ని ఇస్తామంటూ ఆస్పత్రి యాజమాన్యం చెప్తోందని మండిపడుతున్నారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఆస్పత్రి ఎదుట నేడు ఆందోళనకు దిగారు. చనిపోయిన వ్యక్తికి వైద్యం చేసి దోపిడీ చేస్తున్న ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహం కోసం రెండ్రోజులుగా నిరీక్షిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Today Gold Rates: గుడ్ న్యూస్.. నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..

Hanumakonda: ఇంటర్ మెుదటి సంవత్సరం విద్యార్థిని ఆత్మహత్య.. విషయం ఇదే..

Updated Date - Dec 25 , 2024 | 02:01 PM