ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన

ABN, Publish Date - Nov 09 , 2024 | 10:39 PM

జిల్లా కేంద్రంలోని సాయికుంటలో స్పోర్ట్స్‌ సేడియం ఏర్పాటుకు 12 ఎకరాల స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే స్థలానికి సంబంధించిన హద్దుల ను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

మంచిర్యాల అర్బన్‌, నవంబర్‌ 9 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని సాయికుంటలో స్పోర్ట్స్‌ సేడియం ఏర్పాటుకు 12 ఎకరాల స్థలాన్ని శనివారం ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ తో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే స్థలానికి సంబంధించిన హద్దుల ను పరిశీలించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. నస్పూర్‌ మున్సిపల్‌ చైర్మన్‌ సుర్మిళ్ల వేణు, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ మధూకర్‌, నాయకులు తూముల నరేష్‌, పూదరి తిరుపతి పాల్గొన్నారు.

ఆశ్రమ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్యే

ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా బీఆర్‌ఎస్‌, బీజేపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని సాయికుంటలో గల బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు ఇటీవల అస్వస్థతకు గురి కాగా శనివారం ఆయన కలెక్టర్‌ కుమార్‌దీపక్‌తో కలిసి సందర్శించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను పరామర్శించి వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు పిల్లలతో రాజకీయం చేయడాన్ని మానుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటేనే సంక్షేమానికి మారుపేరని అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వ హయాంలో 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను క్లియర్‌ చేశామన్నారు. నాలుగేళ్ళుగా పెండింగ్‌లో ఉన్న అద్దె భవనాల బిల్లులను క్లియర్‌ చేశామని, అలాగే డైట్‌ చార్జీలను 40శాతం, కాస్మోటిక్‌ చార్జీలను పెంచిన ఘనత మా ప్రభుత్వానిదేనని అన్నారు. ఆయన వెంట అధికారులు, నాయకులు ఉన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 10:39 PM