పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక దృష్టి సారించాలి
ABN, Publish Date - Nov 19 , 2024 | 10:15 PM
గ్రామాల్లో పారిశుధ్యం లోపించ కుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం డీఆర్‌డీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశపాండేతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ పరిశుభ్రతతోపాటు నివాస ప్రాంతాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు.
హాజీపూర్, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం లోపించ కుండా ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం డీఆర్‌డీవో కిషన్, తహసీల్దార్ శ్రీనివాస్‌రావు దేశపాండేతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రూ పరిశుభ్రతతోపాటు నివాస ప్రాంతాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ప్రతీ ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పని సరిగా నిర్మిం చుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రభుత్వం పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తోందన్నారు.
అనంతరం కర్ణమామిడిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. నాణ్యమైన ధాన్యం విక్రయించి ప్రభు త్వ మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం మద్దతు ధరతో పాటు 500 బోనస్ ఇస్తోందన్నారు. సన్నరకం, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలన్నారు. రైతులు ధాన్యం ఆరబెట్టిన తర్వాత కేంద్రాలకు తీసుకవచ్చి విక్రయించాలన్నారు. కేంద్రాలలో మౌలిక వసతులు నీడ, తాగునీరు, గన్నిసంచు, టార్పాలిన్లు కవర్స్‌ను అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఇన్‌చార్జి ఎంపీడీవో ప్రసాద్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు.
Updated Date - Nov 19 , 2024 | 10:15 PM