గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు
ABN, Publish Date - Oct 14 , 2024 | 10:38 PM
గ్రామీణ ప్రాంతాల అబివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులు బాలమురళి, సునీల్, డీఆర్‌డీవో కిషన్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 14: గ్రామీణ ప్రాంతాల అబివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్‌దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులు బాలమురళి, సునీల్, డీఆర్‌డీవో కిషన్, జిల్లా వయోజన విద్యాధికారి పురుషోత్తం నాయక్‌తో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. 250 మంది జనాభా కన్నా అధికంగా ఉన్న వివిధ గ్రామాల నుంచి మండల కేంద్రానికి అనుసంధానమయ్యే బీటీ రోడ్లు, మరమ్మతు వివరాలతో నిబంధనలకు లోబడి నివేదిక అందించాలని తెలిపారు. సెంటర్ ఫర్ రూరల్ మేనేజ్‌మెంట్ నేషనల్ లెవెల్ మానిటర్స్ సభ్యులు ఈ నెల 15 నుంచి 19 వరకు జిల్లాలో ఎంపిక చేసిన పది గ్రామాల్లో పర్యటిస్తారని, అభివృద్ధి పనులను పరిశీలిస్తారని తెలిపారు. సభ్యులు గ్రామాల్లో పర్యటించే సమాచారాన్ని ప్రజలకు ముందుగా తెలియజేయాలని, మండల స్ధాయి అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ మోతిలాల్, బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. జైపూర్, బెల్లంపల్లి, దండేపల్లి నుంచి వచ్చిన ప్రజలు దరఖాస్తులు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 18 దరఖాస్తులు వచ్చాయని ప్రతి దరఖాస్తును పరిశీలించి అధికారుల సమన్వయంతో పరిష్కారం దిశగా కృషి చేస్తామని తెలిపారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 14 , 2024 | 10:38 PM