ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు

ABN, Publish Date - Oct 07 , 2024 | 10:47 PM

జిల్లాలో షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాంలతో కలిసి సమావేశం నిర్వహించారు.

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 7 : జిల్లాలో షెడ్యూల్డు తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జెడ్పీ సీఈవో గణపతి, డీపీవో వెంకటేశ్వర్‌రావు, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారాంలతో కలిసి సమావేశం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని షెడ్యూల్డు తెగల ప్రాంతాల్లో చేపట్టే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలకు పూర్తిస్ధాయిలో ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఆయా గ్రామాల్లో వంగిన, విరిగిన విద్యుత్‌స్తంభాలు, తెగిన విద్యుత్‌ తీగలు, 3 ఫేజ్‌ సమస్యలు, విద్యుత్‌ కనెక్షన్‌లు నివేదిక అందించాలన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న అంతర్గత రహదారులు, వంతెనల మరమ్మతు పనుల ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. మిషన్‌ అంత్యోదయలో భాగంగా ఖచ్చా ఇండ్లను గుర్తించాలని, తాగునీటి సరఫరా, వాటర్‌ ట్యాంకులు, మిషన్‌ బగీరథ కనెక్షన్ల వివరాలతో నివేదిక అందించాలన్నారు. జిల్లాలో కనీసం 500 జనాభా కలిగిన గ్రామాల్లో 50 శాతం ఎక్కువ షెడ్యూల్డు తెగల వారు ఉన్న గ్రామాలను గుర్తించాలని తెలిపారు. విద్యుత్‌ శాఖ ఏడీఈ బాలకృష్ణ, అధికారులు పాల్గొన్నారు.

ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రం ఏర్పాటు

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 7: ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినందున కలెక్టరేట్‌లో ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంఎల్‌సీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హులైన వారు ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు. ఓటు నమోదుకు నవంబర్‌ 6 చివరి తేదీ అని పేర్కొన్నారు.

Updated Date - Oct 07 , 2024 | 10:47 PM