క్రీడల్లో రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలి
ABN, Publish Date - Nov 14 , 2024 | 11:08 PM
గురుకుల పాఠశాలల విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కాళేశ్వరం జోన్ 10వ క్రీడా పోటీలు ముగిసాయి. ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
లక్షెట్టిపేటరూరల్, నవంబరు 14 (ఆంధ్ర జ్యోతి): గురుకుల పాఠశాలల విద్యార్థినులు చదువుతోపాటు క్రీడల్లో రాణించి రాష్ట్రానికి గుర్తింపు తీసుకురావాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల మైదానంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న కాళేశ్వరం జోన్ 10వ క్రీడా పోటీలు ముగిసాయి. ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి నులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు. కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి గెలుపొందిన క్రీడాకారు లకు బహుమతులు అందించారు. జోనల్ ఇన్ చార్జీ అరుణకుమారి, ప్రిన్సిపాల్ రమాకళ్యాణి, వైస్ ప్రిన్సిపాల్ మహేశ్వర్‌రావు, తహసీల్దార్ దిలీప్‌కుమార్, పీడీలు, పీఈటీలు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
దండేపల్లి (ఆంధ్రజ్యోతి): రెబ్బనపల్లి ప్రభు త్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉమ్మడి ఆది లాబాద్ జిల్లా జోనల్‌స్థాయి అండర్14 బాలికల వాలీబాల్ ఎంపిక పోటీలు గురువారం ముగి సాయి. ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో ఎంపిక పోటీలు నిర్వహించగా 50మంది క్రీడకారులు పాల్గొ న్నారు. మంచిర్యాల జిల్లా ప్రథమ, ఆదిలాబాద్ ద్వితీయస్ధానంలో నిలిచాయి. సిద్దిపేట జిల్లా చేగుంటలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. ఎస్‌జీఎఫ్ జిల్లా సెక్రెటరీ ఫణి రాజా, ప్రధానోపాధ్యాయుడు మంత్రి రాజు, కాం ప్లెక్స్ హెచ్‌ఎం విజయలక్ష్మి, పీఈటీలు రామ్మో హన్‌రావు, రోజి వర కుమారి, సిరంగ గోపాల్, ఎండి యాకుబ్, సత్యనారాయణ, సాంబమూర్తి, వహిద్, బేగం, కార్తీక్, శ్రీనివాస్‌లు పాల్గొన్నారు.
ఎంపికైన విద్యార్థినులు
రాష్ట్రస్థాయి పోటీలకు 12 మంది బాలికలను ఎంపిక చేశారు. మంచిర్యాల జిల్లా నుంచి పి, హరిప్రియ, ఏ శాలిని (లక్షెట్టిపేట), శ్రీవర్షిణి, ఎం నక్షత్ర (ఆస్నాద్), ఎం శ్రావణి (తాళ్ళపేట), బి అభిశ్రీ (రెబ్బనపల్లి), ఆదిలాబాద్ జిల్లా జయదీక్ష, జే ఆకాంక్ష (మన్నూర్), నిర్మల్ జిల్లా టిఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ చెందిన విద్యార్ధిని ఎం, రుతుజు (పోచంపాడు), పి దీపిక (కుంటాల), టి నవనీత (దిలావర్‌పూర్), ఆసిఫాబాద్ జిల్లా ఆర్ వర్షిత్ (ఆరెగూడ)లు ఎంపికయ్యారు.
Updated Date - Nov 14 , 2024 | 11:08 PM