ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చెరువు సర్వే పనులు ప్రారంభం

ABN, Publish Date - Sep 09 , 2024 | 10:38 PM

మండల కేంద్రంలోని ఊర చెరువు పూర్తిస్థాయి సర్వే పనులు ప్రారంభ మయ్యాయి. భీమారం గ్రామానికి చెందిన తైనేని రవి కలెక్టర్‌కు చెరువును రక్షించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు సోమ వారం తహసీల్దార్‌ సదానందం, ఇరిగేషన్‌ డీఈ శారదలు ముగ్గురు సర్వేయర్లతో పాత మ్యాప్‌ ఆధా రంగా సర్వే పనులను ప్రారంభించారు.

భీమారం, సెప్టెంబరు 9: మండల కేంద్రంలోని ఊర చెరువు పూర్తిస్థాయి సర్వే పనులు ప్రారంభ మయ్యాయి. భీమారం గ్రామానికి చెందిన తైనేని రవి కలెక్టర్‌కు చెరువును రక్షించాలని ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం సర్వే పనులకు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికా రులు చెరువు వద్దకు రాగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా చెరువు సర్వే ఎలా చేస్తారని గ్రామ స్థులు పేర్కొనడంతో పనులను నిలిపివేశారు. రెవె న్యూ అధికారుల ద్వారా నోటీసులు అందజేసి సోమ వారం తహసీల్దార్‌ సదానందం, ఇరిగేషన్‌ డీఈ శారదలు ముగ్గురు సర్వేయర్లతో పాత మ్యాప్‌ ఆధా రంగా సర్వే పనులను ప్రారంభించారు. నోటీసులు అందుకున్న బాధితులు వారి వద్ద ఉన్న ఆధారాలతో అధికారుల వద్దకు వచ్చారు. గతేడాది సర్వే చేసిన హద్దులను రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు పరి శీలించారు. చెరువు శిఖం భూముల్లోనే కొందరు ఇండ్లు నిర్మించుకున్నారని, పూర్తిస్ధాయి సర్వే అనం తరం హద్దురాళ్లు ఏర్పాటు చేస్తామని సర్వే కొన సాగుతుందని పేర్కొన్నారు. చెరువు సర్వే నెంబరు 570లో గతంలో 14 ఎకరాల 39 గుంటల భూమి ఉండేదని, అధి కారులు పూర్తి స్ధాయి సర్వే చేసి హద్దురాళ్లు ఏర్పా టు చేసి ఆక్రమ ణదారుల నుంచి చెరువును రక్షిం చాలని గ్రామ స్థులు కోరారు. సర్వే పనులు సాఫీగా జరిగేలా గ్రామస్థులు సహకరించా లని ఎస్‌ఐ రాములు కోరారు. సర్వే సందర్భంగా పటిష్ట బందోబస్తు నిర్వహించారు. ఆర్‌ఐ స్రవంతి, సర్వేయర్లు పాల్గొన్నారు.

Updated Date - Sep 09 , 2024 | 10:38 PM

Advertising
Advertising