ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

జిల్లాలో పెరుగుతున్న ఆత్మహత్యలు

ABN, Publish Date - Dec 13 , 2024 | 10:42 PM

కుటుంబ సమస్యలు... ఆర్థిక ఇబ్బందులు... అనారోగ్య సమస్యలు... ప్రేమ విఫలమైందని...స్టాక్‌ మార్కెట్‌లో నష్టం వచ్చిందని.. ఇలా రకరకాల కారణాలతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు.. సమస్య ఏదైనా చావే పరిష్కారమని ఆలోచిస్తూ నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బెల్లంపల్లి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): కుటుంబ సమస్యలు... ఆర్థిక ఇబ్బందులు... అనారోగ్య సమస్యలు... ప్రేమ విఫలమైందని...స్టాక్‌ మార్కెట్‌లో నష్టం వచ్చిందని.. ఇలా రకరకాల కారణాలతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విలువైన జీవితాలను విషాదంగా ముగిస్తున్నారు.. సమస్య ఏదైనా చావే పరిష్కారమని ఆలోచిస్తూ నెల రోజుల వ్యవధిలో 20 మందికి పైగా ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఆత్మహత్యలకు కారణాలెన్నో...

చదువును ఒత్తిడిగా భావించి చిన్న వయస్సులోనే ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఒత్తిడిని తట్టుకోలేక పరీక్షలకు ముందు, ఫలితాల తర్వాత ఆత్మహత్యలకు పాల్పడుతూ బంగారు జీవితాన్ని ముగించి తల్లిదండ్రులకు కడుపుకోత మిగులుస్తున్నారు. ర్యాంకుల లక్ష్యంతో కొన్ని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఫలితంగా విద్యార్థులపై మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. తల్లిదండ్రులు సైతం చదువుపై ఒత్తిడి తెస్తుండడం, ఒత్తిడిని తట్టుకోలేక ఆందోళన చెంది పరీక్షలు సరిగ్గా రాయలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

భార్య భర్తలు, తల్లిదండ్రులు కొడుకుల మధ్య గొడవలు, వివాహేతర సంబంధాలతో క్షణికావేశంలో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. మరికొందరైతే తండ్రి కొడుక్కు డబ్బులు ఇవ్వడం లేదని, బర్త్‌ డే పార్టీలు నిర్వహించడం లేదని, బైక్‌ కొనివ్వడం లేదని ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉన్న నేపధ్యంలో ఒకరి బాధలు ఒకరికి చెప్పుకునే అవకాశం ఉండేది. ప్రస్తుతం ఎవరికి వారే ఉండడంతో అధైర్యంతో ఆత్మహత్యలకు దారి తీస్తుంది.

చదువుకునే వయస్సులోనే ప్రేమ పేరుతో తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంట్లో నుంచి వెళ్లిపోయి ప్రేమ వివాహాలు చేసుకుని ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రియురాలు మోసం చేసిందని ప్రియుడు, ప్రియుడు మోసం చేశాడని ప్రియురాలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

కొందరు స్టాక్‌ మార్కెట్‌, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమ్స్‌లో అత్యాశకు పోయి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. షేర్‌ మార్కెట్‌లలో డబ్బులు వస్తాయని అధిక వడ్డీలకు స్ధోమతను మించి అప్పు చేస్తున్నారు. పెట్టుబడులు రాకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు వేధిస్తుండడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. లోన్‌ యాప్‌లలో అప్పులు తీసుకుని చెల్లించకపోవడంతో వారి వేధింపులతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

-ఇటీవల జిల్లాలో జరిగిన ఘటనలు కొన్ని...

-బెల్లంపల్లి పట్టణానికి చెందిన యువతి పట్టణానికి చెందిన యువకుడిని ప్రేమించింది. ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది.

-మంచిర్యాల జిల్లా కేంద్రంలో జీవితంలో స్ధిరపడకముందే ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ విషయం వారి తల్లిదండ్రులకు తెలపడంతో ఉద్యోగం, వ్యాపారం ఏది లేనిది పెళ్లి చేసుకుని ఎలా పోషిస్తావని పెళ్లికి నిరాకరించడంతో యుతీ, యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

-మంచిర్యాల జిల్లా కేంద్రంలోని జాఫర్‌నగర్‌కు చెందిన ఓ 7వ తరగతి విద్యార్ధి పాఠశాలలో ఉపాధ్యాయులు చదవాలని ఒత్తిడికి గురి చేస్తున్నారని ఇంటికి వచ్చి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో కలకలం రేపింది.

-తాండూర్‌ మండలంలోని కాసిపేట గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఆశతో లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టాడు. నష్టం రావడంతో అప్పులు చెల్లించకపోవడంతో తండ్రి, తల్లి, చెల్లెలుతో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

-మంచిర్యాల పట్టణంలోని గోపాల్‌వాడకు చెందిన వివాహిత లోన్‌ యాప్‌ సంస్థ ద్వారా డబ్బులు తీసుకుంది. యాప్‌ నిర్వాహకులు అధిక వడ్డీతో డబ్బులు కట్టాలని వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడింది.

-నస్పూర్‌కు చెందిన యువకుడు లోన్‌ యాప్‌ ద్వారా రుణం తీసుకున్నాడు. వచ్చిన డబ్బులు స్టాక్‌ మార్కెట్‌లో ట్రేడింగ్‌లో పెట్టాడు. నష్టాలు రావడంతో అప్పులు చెల్లించకపోవడంతో సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Updated Date - Dec 13 , 2024 | 10:42 PM