ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయి హ్యాండ్‌బాల్‌ పోటీల్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ

ABN, Publish Date - Dec 02 , 2024 | 10:59 PM

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గత నెల 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొంది.

మంచిర్యాల అర్బన్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో గత నెల 29 నుంచి ఈ నెల 1వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్‌ బాలికల హ్యాండ్‌బాల్‌ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా జట్టు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొంది. సెమీఫైనల్‌లో రంగారెడ్డి టీమ్‌తో తలపడి 17-05 గోల్స్‌తో గెలుపొంది, ఫైనల్‌లో మహబూబ్‌నగర్‌ జట్టుతో హోరాహోరీగా తలపడి 21-14 గోల్స్‌తో గెలుపొంది ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకొందని హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గోనె శ్యాంసుందర్‌ రావు, ప్రధాన కార్యదర్శి కనపర్తి రమేష్‌లు తెలిపారు.

క్రీడాకారులను, కోచ్‌ సునర్కర్‌ అరవింద్‌, మేనేజర్‌ గోగర్ల సాయిలను హ్యాండ్‌బాల్‌ అసోసియేషన్‌ కోశాధికారి అలుగువెల్లి రమేష్‌ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్‌ కార్యదర్శి రఘునాథ్‌రెడ్డి, జిల్లా ఎస్‌జీఎఫ్‌ సెక్రెటరి ఫణిరాజా, కరాటే కార్యదర్శి మహేష్‌, టీడబ్ల్యూ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ మీనా రెడ్డి, క్రీడా సంఘాలు, కోచ్‌లు కళ్యాణ్‌, శేఖర్‌, సీనియర్‌ క్రీడాకారులు ప్రవీణ్‌, కార్తీక్‌, పీఈటీ, పీడీలు అభినందించారు.

Updated Date - Dec 02 , 2024 | 10:59 PM