ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

ABN, Publish Date - Sep 12 , 2024 | 10:47 PM

ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. గురువారం భీమిని ఉన్నత పాఠశాల, భీమిని, బిట్టూరుపల్లి, మామిడిగూడ, పెద్దపేట, భీమిని ఎస్సీ కాలని, భవిత కేంద్రాలను తనిఖీ చేశారు.

భీమిని, సెప్టెంబరు 12: ఉపాధ్యాయులు సమయపాలన పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు. గురువారం భీమిని ఉన్నత పాఠశాల, భీమిని, బిట్టూరుపల్లి, మామిడిగూడ, పెద్దపేట, భీమిని ఎస్సీ కాలని, భవిత కేంద్రాలను తనిఖీ చేశారు. భీమిని ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ ఉపాధ్యాయుడు వి.రమేష్‌, భీమిని ప్రాథ మిక పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఐ.విజయ, పి.స్వాతిలు పాఠశాలకు ఆలస్యంగా రావడంపై డీఈఓ ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

ఆయా పాఠ శాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పరిశీలిం చారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. విద్యార్థుల నైపుణ్యాలను అడిగి తెలుసుకు న్నారు. పదో తరగతి విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ పరీక్షలు అంటే భయం వద్దని ప్రతీ సబ్జెక్టును అర్థం చేసుకో వాలన్నారు. భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాల పిల్ల్లలకు ఏ విధంగా విద్యను బోధిస్తున్నారు. ప్రతీ వారం ఫిజియోథెరపి వైద్యం నిర్వహిస్తున్నారా అని రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట సెక్టోరియల్‌ అధికారి చౌదరి లు ఉన్నారు.

Updated Date - Sep 12 , 2024 | 10:47 PM

Advertising
Advertising