ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ABN, Publish Date - Sep 05 , 2024 | 10:47 PM

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మం డలానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళపై అత్యాచారయత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్యక్షుడు కనక జంగు, గోండ్వాన పంచాయతీరాజ్‌ రాయి సెంటర్‌ మండల అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్‌లు డిమాండ్‌ చేశా రు

దండేపల్లి, సెప్టెంబరు 5: కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మం డలానికి చెందిన ఆదివాసి గిరిజన మహిళపై అత్యాచారయత్నం చేసిన దుండగుడిని కఠినంగా శిక్షించాలని మండల ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ అధ్యక్షుడు కనక జంగు, గోండ్వాన పంచాయతీరాజ్‌ రాయి సెంటర్‌ మండల అధ్యక్షుడు పెంద్రం శ్రీనివాస్‌లు డిమాండ్‌ చేశా రు. గురువారం ఏజెన్సీ బంద్‌ పిలుపులో భాగంగా ముత్యంపేట, దండే పల్లి, మ్యాదరిపేట, తాళ్ళపేట గ్రామాలోని వ్యాపార వాణిజ్య సంస్ధలను మూసి వేయించారు. ఆదివాసిలు ర్యాలీ చేపట్టి నిందితుడిని ఉరి తీయా లని డిమాండ్‌ చేశారు. అనంతనం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కుడిమేత సోము, ఆడాయి కాంతరావు, భూమేష్‌, సెదం బాపు, కోమురం శంకర్‌, నరేందర్‌, పాల్గొన్నారు.

ఆదివాసి గిరిజనులు సంయమనం పాటించాలని సీఐ అల్లం నరేందర్‌, ఎస్సై ఉదయ్‌కిరణ్‌లు సూచించారు ఆదివాసి సంఘాలు బంద్‌కు పిలుపు నివ్వడంతో మండల కేంద్రంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. తాళ్ళపేట, మ్యాదరిపేట, దండేపల్లి, ముత్యంపేటలో బందోబస్తు నిర్వహించారు.

కాసిపేట: ఆదివాసీ గిరిజన మహిళపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాల నాయకులు దేవాపూర్‌లో నిరసన తెలిపారు. ఆదివాసీ తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి ఆడె జంగు మాట్లాడుతూ నిందితుడికి మరణ శిక్ష విధించాలని, మహి ళకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. సీఐ శశిధర్‌రెడ్డి వారిని శాంతింపజేయడంతో ఆందోళన విరమించారు. నిందితున్ని శిక్షిం చాలని సీఐకి వినతి పత్రం అందించారు. పెంద్రం హన్మంతు, వెడ్మ కిషన్‌, కొమ్ముల బాపు, సండ్ర భూమయ్య, కనకరాజు, పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2024 | 10:47 PM

Advertising
Advertising