దోషులను కఠినంగా శిక్షించాలి
ABN, Publish Date - Sep 19 , 2024 | 11:42 PM
శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ నాయకుడు రాజారమేష్ డిమాం డ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు మత్తడిని పేల్చడం హేయమైన చర్య అన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 19: శనగకుంట చెరువు మత్తడి ధ్వంసం చేసిన దోషులను కఠినంగా శిక్షించాలని బీఆర్‌ఎస్ నాయకుడు రాజారమేష్ డిమాం డ్ చేశారు. గురువారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ చెరువు మత్తడిని పేల్చడం హేయమైన చర్య అన్నారు. పోలీ సులు విచారణ పేరుతో అధికార పార్టీకి చెందిన అసలు దోషులు కాంగ్రెస్ వదిలిపెట్టి అమాయకులను వేధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిం చారు. పట్టణంలో షాడో ఎమ్మెల్యేగా పేరున్న ఓ బడా నాయకుని కనుసన్న ల్లోనే బ్లాస్టింగ్ జరిగిందన్నారు. మత్తడి ధ్వంసం కేసులో నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఎవరున్నా కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయకట్టు రైతులకు పరిహారం చెల్లించాలన్నారు. మున్సిపల్ వైస్‌చైర్మన్ నవాజుద్దీన్, కౌన్సిలర్లు రేవెల్లి మహేష్, దోమకొండ అనిల్, జగన్నాధుల శ్రీను, జోడు శంకర్, తుమ్మ రమేష్, నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మత్తడి పేల్చడం బాధాకరం : ఎమ్మెల్యే
శనగకుంట చెరువు మత్తడిని పేల్చడం బాధాకరమైన విషయమని ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. అనారోగ్య కారణాలతో శనగకుంట చెరువును సందర్శించ లేక పోయానని తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సంబంధిత పోలీ సు శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సంఘ విద్రోహక చర్యలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Updated Date - Sep 19 , 2024 | 11:42 PM