కుటుంబ సభ్యుల వివరాలు సక్రమంగా సేకరించాలి
ABN, Publish Date - Oct 04 , 2024 | 10:39 PM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి ఇంటింటా కుటుంబ సభ్యుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం అల్లీపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నమోదు ప్రక్రియను పరిశీలించారు.
దండేపల్లి, అక్టోబరు 4: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుటుంబ డిజిటల్ కార్డుల జారీకి సంబంధించి ఇంటింటా కుటుంబ సభ్యుల వివరాలను ఎలాంటి తప్పులు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం అల్లీపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డుల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టులో భాగంగా అల్లీపూర్‌లో ఇంటింటా ఫ్యామిలీ సర్వేలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారి నుంచి పూర్తి వివరాలు సేకరించాలన్నారు. ఈ సర్వేను ఈనెల 9 వరకు సేకరించాలన్నారు. సర్వే బృందాలకు అందించిన జాబితా ప్రకారం పేర్లు వివరాలు సరి చేయాలన్నారు. అనంతరం దండేపల్లి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రికి వచ్చే రోగులకు ఇచ్చే వైద్యం తీరును పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉండి మంచి వైద్యం అందించాలని సూచించారు. గ్రామాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. కస్తూర్బా విద్యాలయంలో చేపట్టే నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు నాణ్యతతో చేపట్టి దసరా సెలవుల్లపు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. తహసీల్దార్ సంధ్యరాణి, ఎంపిడివో జేఆర్ ప్రసాద్, మండల పరిషత్, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, పాల్గొన్నారు.
సర్వే ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలి
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 4 : జిల్లాలో చేపట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలెట్ ప్రాజెక్టు సర్వే ప్రక్రియను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేసే విధంగా అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల మున్సిపాలిటీలోని 16వ వార్డు అశోక్‌రోడ్డులో నిర్వహిస్తున్న సర్వేను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేను సకాలంలో పూర్తి చేసి 9వ తేదీన వివరాలను పరిశీలించి నిర్ణీత ప్రొఫార్మాలో పొందుపర్చి నివేదిక అందించాలన్నారు. ఒక కుటుంబానికి ఒక కార్డు ఉంటుందని, కుటుంబంలోని ప్రతీ సభ్యుడికి ప్రత్యేక నంబరు కేటాయిస్తామన్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలన్నీంటికి ఒకే కార్డు అనుసంధానమై ఉంటుందన్నారు. మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్,అధికారులుపాల్గొన్నారు.
Updated Date - Oct 04 , 2024 | 10:39 PM