ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలి
ABN, Publish Date - Nov 12 , 2024 | 10:15 PM
18 సంవత్స రాలు నిండిన వారందరు ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసర్‌రావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): 18 సంవత్స రాలు నిండిన వారందరు ఓటరు జాబితాలో వివరాలు నమోదు చేసుకోవాలని ఓటర్ల జాబితా పరిశీలకులు సురేంద్రమోహన్ అన్నా రు. మంగళవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, ఆర్డీవోలు శ్రీనివాసర్‌రావు, హరికృష్ణ, చంద్రకళతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ ఓటర్ల జాబితా సవరణకు ఇది మంచి అవకాశామని, ఎలాంటి పొరపాట్లు లేకుండా స్పష్టమైన ఓటరు జాబితా రూపొందించడంలో రాజకీయ పార్టీల సహకారం అవసరమన్నారు.
మరణించిన వారి వివరాలు, మార్పులు, తొలగింపులు, సవరణలపై ప్రత్యేక దృష్టి సారిం చాలన్నారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఒకే పోలింగ్ బూత్‌లోకి వచ్చేలా చర్యలు చేపట్టాలన్నారు. నూతన ఓటరు నమోదుపై ప్రజ లకు అవగాహన కల్పించాలన్నారు. ఈ నెల 26న యువత, విద్యార్థు లతో 2కే రన్ నిర్వహించాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టం ద్వారా 397 దరఖాస్తులు రాగా అన్నింటిని పరిష్కరిం చామన్నారు. జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 747 పోలింగ్ కేంద్రానలు గుర్తించామన్నారు. అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Nov 12 , 2024 | 10:15 PM