ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
ABN, Publish Date - Sep 06 , 2024 | 10:46 PM
గణపతి ఉత్సవాలను, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. సంతోషి మాత ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మండపాల వద్ద ఎలాంటి గొడవలకు తావివ్వకూడదన్నారు.
చెన్నూరు, సెప్టెంబరు 6: గణపతి ఉత్సవాలను, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావర ణంలో జరుపుకోవాలని జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు కోరారు. సంతోషి మాత ఫంక్షన్ హాలులో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశంలో మాట్లాడారు. మండపాల వద్ద ఎలాంటి గొడవలకు తావివ్వకూడదన్నారు. చెరువు కట్ట వద్ద ఉన్న ఘాట్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీఐలు రవీందర్, సుధాకర్, మున్సిపల్ కమిషనర్ గంగాదర్, విద్యుత్ ఏఈ శ్రీనివాస్ ఉన్నారు.
జైపూర్: ప్రశాంత వాతావరణంలో గణపతి పండగను జరుపుకోవాలని సీఐ మోహన్ పేర్కొన్నారు. పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నిర్వాహకులు పోలీసులకు సహకరించాలన్నారు. ఎస్‌ఐ శ్రీధర్ పాల్గొన్నారు.
వేమనపల్లి: పండగను ప్రశాంతంగా జరుపుకోవాలని నీల్వాయి ఎస్‌ఐ శ్యామ్ పటేల్ సూచించారు. మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. పోలీసులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి
శ్రీరాంపూర్: గణేష్ మండపాల నిర్వాహకులు మండపం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకొని పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. వారికి వచ్చిన క్యూ ఆర్ కోడ్‌ను ప్రింట్ తీసి లామినేషన్ చేసుకోవాలని సూచించారు. పోలీసులకు క్యూ ఆర్ కోడ్‌ను చూపించాలని పేర్కొన్నారు.
భీమిని: గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించు కోవాలని ఎస్సై విజయ్ కుమార్ సూచించారు. ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. తహసీల్దార్ బికర్ణ దాస్, ఏఎస్సై తిరుపతి పాల్గొన్నారు.
బెల్లంపల్లి: గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆర్డీవో హరికృష్ణ అన్నారు. రెవెన్యూ, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆర్డీవో మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండపాలను రోజు పరిశీలించాలని సూచించారు
Updated Date - Sep 06 , 2024 | 10:46 PM