ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ముహూర్తం ఖరారు

ABN, Publish Date - Nov 19 , 2024 | 10:17 PM

జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పి టల్‌, మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 21న ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కేంద్రం లోని ఐబీ చౌరస్తా సమీపంలోని పాత ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణా నికి అధికారులు స్థలం ఎంపిక చేశారు.

మంచిర్యాల, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలో నిర్మించతలపెట్టిన సూపర్‌ స్పెషాలిటీ హాస్పి టల్‌, మాతా శిశు ఆరోగ్య కేంద్రానికి ముహూర్తం ఫిక్స్‌ అయింది. ఈ నెల 21న ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. జిల్లా కేంద్రం లోని ఐబీ చౌరస్తా సమీపంలోని పాత ప్రభుత్వ అతిథి గృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణా నికి అధికారులు స్థలం ఎంపిక చేశారు. గతంలో ఆ స్థలంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ భవన నిర్మాణం, ఆర్‌అండ్‌బీ కార్యాలయం, అతిథిగృహం, ఆర్డీవో కార్యాలయాలను కూల్చివేశారు. ఆర్డీవో, ఆర్‌అండ్‌బీ కార్యాలయాలను స్థానిక పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌కు తరలించారు. ఆసుపత్రుల భవన నిర్మాణాల కోసం ఇప్పటికే స్థలాన్ని వైద్య ఆరోగ్యశాఖకు రెవెన్యూ అధికారులు అప్పగించారు. తెలంగాణ హెల్త్‌, మెడికల్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ తొలి విడుతగా రూ.50 కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేస్తూ సెప్టెంబరు 12న జీవో 546ను కూడా విడుదల చేసింది.

రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో...

ప్రభుత్వ అతిథిగృహ ఆవరణలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటు చేస్తామన్న ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు హామీలో భాగంగా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ. 324 కోట్ల అంచనా వ్యయంతో ఏడు అంతస్థులతో ఆసుపత్రి భవన నిర్మాణం చేపట్టనున్నారు. ఇటీవల తెలం గాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ నిధులు కేటా యించారు. దీంతో ఆసుపత్రి నిర్మాణానికి మార్గం సుగ మం కాగా గరిష్టంగా మూడేళ్ళలో భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలనే లక్ష్యంతో యంత్రాంగం ఉంది. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంతో మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి.

ఎంసీహెచ్‌ కూడా అక్కడే....

ప్రస్తుతం గోదావరి సమీపంలో ఉన్న మాతా, శిశు ఆరోగ్య కేంద్రం (ఎంసీహెచ్‌)ను కూడా సూపర్‌ స్పెషా లిటీ ఆసుపత్రి ప్రాంగణంలోకి మార్చనున్నారు. ఈ మేరకు ఆస్పత్రి ప్రాంగణంలో ప్రత్యేక భవన నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు. సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంసీహెచ్‌ రెండు ఒకే ప్రాంగణంలో ఉండడంతో రోగు లకు వైద్యసేవల పరంగా అందుబాటులో ఉండను న్నాయి. ఎంసీహెచ్‌ గోదావరి సమీపంలో ఉండటంతో వర్షాకాలంలో యేటా వరద ముంపునకు గురవుతోంది. దీంతో అక్కడ చికిత్స పొందే గర్భిణిలు, బాలింతలతో పాటు చిన్నారులను ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి తరలిం చాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

ఆసుపత్రులకు అనువైన స్థలం...

ఐబీ సమీపంలో ఆసుపత్రుల నిర్మాణానికి కేటాయిం చిన స్థలం అన్ని విధాలా అనువైనదనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన స్థలానికి ఎదురుగా ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి ఉండటం, వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉంటుందని అప్పటి అధికారులు సైతం అభిప్రాయపడ్డారు. పైగా పట్టణంలోని ప్రధాన చౌరస్తా వద్ద ఉండటంతో బస్సుల్లో ప్రయాణించే వారికి సౌకర్యవంతంగా ఉండనుంది. బస్సు దిగిన వెంటనే ఆసుపత్రిలో అడుగుపెట్టే వెసులుబాటు ఉండనుంది. పైగా రెండు ఆస్పత్రులకు నడుమ జాతీయ రహదారి ఉండటంతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి నిర్మిస్తే నిత్యం బిజీగా ఉండే రోడ్డు దాటకుండానే అవసరమైన చికిత్సలు పొందే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

హాజరుకానున్న మంత్రులు....

ఈ నెల 21న సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, ఎంసీహెచ్‌కు పలువురు రాష్ట్ర మంత్రులు శంకుస్థాపన చేయనున్నారు. ఇందు కోసం స్థలాన్ని చదును చేసి, స్టేజీ ఏర్పాట్లు చేస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ, ఫ్యామిలీ వెల్ఫేర్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ శాఖ మంత్రి దామోదర రాజ నర్మింహా, పంచాయతీరాజ్‌, మహిళ శిశు సంక్షేమశాఖ మంత్రి అనసూయ (సీతక్క), ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హాజరవుతుండగా, సుమారు నాలుగు వేల మందిని తరలించేందుకు నాయకులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. వేదిక, బందోబస్తు ఏర్పాట్లను మంగళవారం మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌, పట్టణ, రూరల్‌ సీఐలు ప్రమోద్‌రావు, ఆకుల అశోక్‌లు పరిశీలించారు.

Updated Date - Nov 19 , 2024 | 10:17 PM