మహనీయుల మార్గం ఆదర్శనీయం
ABN, Publish Date - Sep 27 , 2024 | 10:41 PM
మహానీయులు చూపిన మార్గం అందరికి ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహిం చారు. కలెక్టర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 27: మహానీయులు చూపిన మార్గం అందరికి ఆదర్శనీయమని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహిం చారు. కలెక్టర్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ మహానీయుల చరిత్రను కాపాడుతూ వారి ఆశయాలను భావితరాలకు అందించాలని సూచించారు. లక్ష్మణ్ బాపూజీ బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి కృషి చేశారన్నారు. అదనపు కలెక్టర్ మోతి లాల్, బీసీ డెవలప్‌మెంట్ అధికారి వినోద్‌కుమార్, పద్మశాలి సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలువేరు సదానందం, నాయకులు గుండేటి యోగేశ్వర్, సుదర్శన్ పాల్గొన్నారు.
గర్మిళ్ల, సెప్టెంబరు 27: మంచిర్యాలలోని రాముని చెరువు కట్టపై ఉన్న రీడింగ్ రూమ్ ఆవరణలో స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూ జీ జయంతి శుక్రవారం సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం, వాకర్స్ అసోసియేషన్ నాయకులు నిర్వ హించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గజెల్లి వెంకటయ్య, నర్స య్య, రాంరెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు. తహసీల్దార్ కృష్ణ, రిటైర్డ్ ఎంఈవో మోహన్, భాస్కర్‌రావు, రాంరెడ్డి, ప్రేంరావు, జనార్దన్‌గౌడ్, పాల్గొన్నారు.
మున్సిపల్ కార్యాలయంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి నిర్వహించారు. మున్సిపల్ చైర్మ న్ ఉప్పలయ్య, మేనేజర్ విజయ్‌కుమార్ పాల్గొన్నా రు. ఎస్టీ బాలుర వసతి గృహంలో బాపూజీ జయం తి నిర్వహించారు. పద్మశాలి సంఘం నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. భక్త మార్కండేయ పద్మశాలి సంఘం నాయకులు టచ్ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. డాక్టర్ రాజ్‌పాల్, వికాస్, రాజేష్ పాల్గొన్నారు.
హాజీపూర్: గుడిపేట 13వ బెటాలియన్‌లో బెటా లియన్ కమాండెంట్ వెంకటరాములు బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అసిస్టెంట్ కమాండెంట్ నాగేశ్వర్‌రావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మార్కండేయ పద్మశాలి సం ఘం నాయకులు బాపూజీ చిత్రపటానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. కృష్ణమూర్తి, ప్రభాకర్, రాజేశం, విష్ణు, వెంకటి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
Updated Date - Sep 27 , 2024 | 10:41 PM