ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
ABN, Publish Date - Nov 20 , 2024 | 10:29 PM
జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమి షనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమి షనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్‌తో కలిసి సమావేశం నిర్వహిం చారు. ఆయన మాట్లాడుతూ సన్నరకం వడ్లకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తోందన్నారు. ధాన్యం కొన్న వెంటనే రైతుల వివరాలను ట్యాబ్‌లలో నమో దు చేసి 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో నగదు జమయ్యేలా చర్యలు తీసు కోవాలన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాగింగ్ చేసిన రైసుమిల్లుల సామర్ధ్యానికి అనుగుణంగా అందించాలని, నిర్ధేశిత లక్ష్యానికి అనుగుణంగా రైసుమిల్లులు పనిచేయాలని, లేకుంటే చర్యలు తీసుకొంటామన్నారు. కొను గోలు సమయంలో సంబంధిత రైతుకు రశీదులు జారీ చేయాలని తెలిపారు. సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా వాహనాల తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
హాజీపూర్, (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ అన్నారు. గుడిపేటలో కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ కుమార్‌దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, డీఆర్‌డీవో కిషన్, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, మేనేజర్ శ్రీకళతో కలిసి సందర్శించారు. ధాన్యంలో తేమ శాతం, కేంద్రాల్లో నిర్వహిస్తున్న రిజిష్టర్‌లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ సన్న, దొడ్డురకం ధాన్యాన్ని వేర్వేరుగా కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తేమ యంత్రాలు, నీడ, గన్నీ సంచులు అందుబాటులో ఉండాలన్నారు.
Updated Date - Nov 20 , 2024 | 10:29 PM