మాదిగలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి
ABN, Publish Date - Oct 06 , 2024 | 10:15 PM
మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక హాలులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 6: మాదిగలకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు చెన్నూరి సమ్మయ్య మాదిగ అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని చార్వాక హాలులో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. సుప్రీంకోర్టు ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన వెంటనే రాష్ట్రంలో అమలు చేస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారన్నారు.
ఇందుకు నిరసనగా ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాలను ముట్టడిస్తామని, ఇందులో భాగంగా కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు. నాయకులు, కార్యకర్తలు, నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో ముట్టడి కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు. నాయకులు అశోక్ మాదిగ, అంజన్న మాదిగ, సతీష్ మాదిగ, ఐలక్క మాదిగ, శంకర్ మాదిగ, సారంగం మాదిగ, రమేష్ మాదిగ, సుగుణాకర్మాదిగ, ఉదయ్‌కిరణ్, విష్ణు, ప్రాన్సిస్, ఆదిత్య,లక్ష్మణ్ మాదిగలు పాల్గొన్నారు.
Updated Date - Oct 06 , 2024 | 10:15 PM