ఇసుక సమస్య పరిష్కరించాలి
ABN, Publish Date - Aug 30 , 2024 | 10:31 PM
రెండు నెలలుగా ఇసుక సమస్యతో ఉపాధి దొరకడం లేదని, సమస్యను పరిష్కరించాలని శుక్రవారం కాంటా చౌర స్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ రెం డు నెలలుగా మైనింగ్ అధికారులు ఇసుక ఆన్‌లైన్ ఇవ్వని కారణంగా ఇంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 30: రెండు నెలలుగా ఇసుక సమస్యతో ఉపాధి దొరకడం లేదని, సమస్యను పరిష్కరించాలని శుక్రవారం కాంటా చౌర స్తా నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు భవన నిర్మాణ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ రెం డు నెలలుగా మైనింగ్ అధికారులు ఇసుక ఆన్‌లైన్ ఇవ్వని కారణంగా ఇంటి నిర్మాణాలు జరగడం లేదన్నారు. దాదాపు 2 వేల మంది కూలీలు నష్టపోతున్నారని పేర్కొన్నారు.
సమస్యపై అధికారులు పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నెన్నెల మండలం ఖర్జీలోని ఇసుక రీచ్ వద్ద చెక్‌డ్యాం నిర్మాణంతో ట్రాక్టర్లు వెళ్లే దారిలో నీరు నిలిచి ఇసుక రవాణాకు ఆటంకం ఏర్పడిందన్నారు. ర్యాలీ అనంతరం మున్సి పల్ కార్యాలయం వద్ద కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. సంఘం అధ్యక్షుడు రాంకుమార్, ప్రధానకార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 10:31 PM