సర్వే ప్రకియ సమర్ధవంతంగా నిర్వహించాలి
ABN, Publish Date - Nov 08 , 2024 | 10:17 PM
ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం 6, 21 వార్డుల్లో, తాళ్లగురిజాలలో కొనసాగుతున్న సర్వేను ఆర్డీవో హరికృష్ణ, డీపీవో వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు.
బెల్లంపల్లి, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన సామాజిక ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వేను సమర్ధవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం 6, 21 వార్డుల్లో, తాళ్లగురిజాలలో కొనసాగుతున్న సర్వేను ఆర్డీవో హరికృష్ణ, డీపీవో వెంకటేశ్వర్‌రావుతో కలిసి పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ సర్వేలో భాగంగా ముందు ఇండ్ల సర్వే పూర్తి చేసి గుర్తించిన ఇండ్లకు స్టిక్కర్లు అతికించాలన్నారు. శుక్రవారం నుంచి గుర్తించిన ఇండ్లలో నివసిస్తున్న కుటుంబ సభ్యుల సర్వే ప్రారంభిస్తారన్నారు. సర్వే నిర్వహణలో ఏమైనా అనుమానాలుంటే అధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రబుత్వం నిర్ణయించిన గడువు తేదీలోగా సర్వే ప్రక్రియ పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
కుల గణన ప్రారంభం
కాసిపేట, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక రాజకీయ సామాజిక కుల గణన సర్వే శుక్రవారం కాసిపేటలో ప్రారంభమైంది. 75 మంది ఎన్యుమరేటర్లు పనిచేస్తున్నారు. శుక్రవారం కోమటిచేను, ముత్యంపల్లిలో చేస్తున్న సర్వేను ఎంపీడీవో సత్యనారాయణసింగ్, ఎంపీవో సప్దర్‌ఆలీలు పరిశీలించారు. సర్వేను పకడ్బందీగా సర్వే చేపట్టాలని సూచించారు.
Updated Date - Nov 08 , 2024 | 10:17 PM