ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రివాల్వర్‌తో బెదిరించిన కేసులో ముగ్గురి అరెస్ట్‌

ABN, Publish Date - Sep 08 , 2024 | 10:25 PM

మంచిర్యాల జిల్లా కేం ద్రంలో రివాల్వర్‌తో బెదిరించిన సంఘటన కలకలం రేపింది. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు. నెన్నెల మండ లం ఆవడం గ్రామానికి చెందిన జితేందర్‌ స్వాతి దంపతుల మధ్య గొడవలతో మూడు నెలల నుంచి స్వాతి ఏసీసీలోని పుట్టింట్లో ఉంటుందని పేర్కొ న్నారు.

నస్పూర్‌, సెప్టెంబరు 8: మంచిర్యాల జిల్లా కేం ద్రంలో రివాల్వర్‌తో బెదిరించిన సంఘటన కలకలం రేపింది. శనివారం విలేకరుల సమావేశంలో డీసీపీ భాస్కర్‌ వివరాలను వెల్లడించారు. నెన్నెల మండ లం ఆవడం గ్రామానికి చెందిన జితేందర్‌ స్వాతి దంపతుల మధ్య గొడవలతో మూడు నెలల నుంచి స్వాతి ఏసీసీలోని పుట్టింట్లో ఉంటుందని పేర్కొ న్నారు. ఈనెల 5న జితేందర్‌ అత్తగారింటికి రాగా అవడంకు చెందిన రాంటెంకి అన్వేష్‌ ఇంట్లో ఉండ డంతో వారి మధ్య మాటామాటా పెరిగిందని తెలి పారు. అన్వేష్‌ జితేందర్‌పై దాడి చేయడంతోపాటు బయటకు తీసుకువచ్చి రివాల్వర్‌తో బెదిరించాడని, జితేందర్‌ కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు రావడంతో అన్వేష్‌ వెళ్ళిపోయాడని పేర్కొన్నారు. అనంతరం జితేందర్‌ పోలీసులకు ఫిర్యాదుచేశారు. విచారణ చేపట్టిన పోలీసులు రాంటెంకి అన్వేష్‌, దుర్గం భానుప్రసాద్‌ (ఆవడం), మంతెన అశోక్‌ (నస్పూర్‌)లను మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో పట్టుకు న్నామని తెలిపారు. వారి వద్ద నుంచి రివాల్వర్‌, ఎయిర్‌ పిస్టల్‌, రెండు కత్తులు, మూడు బుల్లెట్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు తోకల తిరుపతి రోడ్డు ప్రమాదంలో ఎనిమిది నెలల క్రితం మృతి చెందగా అతనికి చెందిన రివాల్వర్‌గా డీసీపీ పేర్కొ న్నారు. తిరుపతి బావమరిది అయిన మంతెన అశో క్‌ వద్ద రివాల్వర్‌ దాచిపెట్టాడు. అప్పుడప్పుడు తీసు కెళ్ళి మళ్ళీ అశోక్‌ ఇంట్లో దాచేవాడు. తిరుపతి చనిపోవడంతో రివాల్వర్‌ అశోక్‌ వద్ద ఉంది.

అన్వేష్‌, భానుప్రసాద్‌లు వరుసకు అన్నదమ్ములు కాగా వీరికి అశోక్‌ స్నేహితుడని తెలి పారు. నెన్నెల మండలానికి చెందిన కామెర మధు, దుగు ట దిలీప్‌లతో కలిసి రాగి బిల్ల లకు పూత పూసి బంగారు నాణేలుగా నమ్మించి విక్రయి స్తున్నారన్నారు. పలు సంఘట నల్లో ప్రజలను రివాల్వర్‌తో బెదిరించేవారని తెలిపారు. జితేందర్‌ను చంపేందుకు భానుప్రసాద్‌ ద్వారా అన్వేష్‌కు అశోక్‌ రివాల్వర్‌ అందజేశాడని తెలిపారు. రివాల్వర్‌తోపాటు నాం ధేడ్‌లో ఒక ఎయిర్‌ పిస్టల్‌, కత్తి కొనుగోలు చేశారని పేర్కొన్నారు. నిందితులు రాంటెంకి అన్వేష్‌, దుర్గం భాను ప్రసాద్‌, మంతెన అశోక్‌లను అరెస్టు చేశామని తెలిపారు. మంచి ర్యాల ఏసీపీ ప్రకాష్‌, సీఐ బన్సీలాల్‌ పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 08 , 2024 | 10:25 PM

Advertising
Advertising