ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పంచాయతీలకు నిధుల కొరత

ABN, Publish Date - Sep 03 , 2024 | 10:41 PM

గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుధ్యం నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు. సర్పంచుల పదవీకాలం ముగియడంంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది.

మంచిర్యాల, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీలను నిధుల కొరత వేధిస్తోంది. పారిశుధ్యం నిర్వహణ సహా ఇతర అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కొద్ది నెలలుగా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల నిలిచిపోవడంతో ఖజానా ఖాళీగా దర్శనమిస్తోంది. ఓ వైపు ట్రాక్టర్ల నెలవారీ కిస్తీలు పేరుకుపోతుండగా, మరోవైపు కార్మికులకు వేతనాలు లేక ఇబ్బందులు తప్పడంలేదు. సర్పంచుల పదవీకాలం ముగియడంంతో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. దాదాపు ఆరు నెలలుగా నిధులు మంజూరు కావడంలేదు. మేజర్‌ పంచాయతీలు మినహా చిన్న పంచాయతీల్లో పాలన కార్యదర్శులకు భారంగా మారుతోంది. పారిశుధ్యం, తాగునీటి అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేస్తున్నా.. నెలల తరబడి బిల్లులు విడుదల కాకపోవడంతో వారు కూడా చేతులెత్తేసే పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఆదిలాబాద్‌ జిల్లాలో నిధుల లేక నిర్వహణ భారమై పంచాయతీ కార్యదర్శులు సామూహిక సెలవులు పెట్టారు. జిల్లాలోని కార్యదర్శులు సైతం అదేబాటలో పయనించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రత్యేకాధికా రులు వారంలో ఒకసారి కూడా పంచాయతీలను దర్శించడం లేదని, బాధ్యత మొత్తం తమపైనే పడుతోందని కార్యదర్శులు వాపోతున్నారు.

బిల్లులు రాక తప్పని ఇబ్బందులు...

ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన సర్పంచుల పదవీకాలం ముగిసింది. సాధారణంగా పంచాయతీల్లో పన్నులను మార్చి నెలాఖరులో వసూలు చేస్తారు. పాలకవర్గాల పదవీకాలం ముగుస్తుండడతో మెజార్టీ గ్రామాల్లో ముందుగానే పన్నులు వసూలు చేశారు. ఇలా సమకూరిన సొమ్మును పంచాయతీ అవసరాల కోసం వెచ్చించిన సామగ్రికి బిల్లులు పెట్టి సర్పంచ్‌లు డబ్బులు తీసుకున్నారు. మరికొందరి బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉండడంతో సంబంధిత అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తు న్నారు.

జేబుల్లో నుంచి కార్మికులకు వేతనాలు....

చిన్న పంచాయతీల్లో పనిచేసే కార్మికులకు మూడు, నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించడంలేదు. నీటి సరఫరా, పారిశుధ్య కార్మికులు పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కార్యదర్శులు జేబుల నుంచి వేతనాలు చెల్లించాల్సి వస్తోంది. వీధి దీపాల బిల్లుల చెల్లింపు, తాగునీటి పథకాల నిర్వహణ, విద్యుత్‌ మోటార్ల మరమ్మతు వంటి అత్యవసర పనులకు కార్యదర్శులు సర్దుబాటు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒక్కో గ్రామ పంచాయతీలో రూ.లక్ష నుంచి రూ.2 లక్షలు, మేజర్‌ గ్రామ పంచాయతీలైతే రూ.5 లక్షల వరకు వివిధ పనుల నిమిత్తం కార్యదర్శులు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు.

రావాల్సినవి రూ.6 కోట్ల పైచిలుకు....

జిల్లాలో 311 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రతీ నెలా సుమారు రూ.6 కోట్ల వరకు నిధులు విడుదల కావలసి ఉంది. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులను (ఎస్‌ఎఫ్‌సీ) ప్రభుత్వం ప్రతీనెలా, కేంద్రానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు (ఎఫ్‌ఎఫ్‌సీ) ప్రతీ మూడు నెలలకోసారి విడుదల చేయాల్సి ఉంది. అయితే ఆరు నెలలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడంలేదు.

కంటి తుడుపు చర్యగా నిధులు విడుదల...

పంచాయతీల్లో అభివృద్ధి దాదాపుగా పడకేసే పరిస్థితికి చేరడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కంటి తుడుపు చర్యగా నిధులు విడుదల చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టులో రూ.6 కోట్లు విడుదల చేయగా, కేంద్రం గత సెప్టెంబరులో రూ.4 కోట్లు విడుదల చేసింది. విడుదలైన నిధులు పంచాయతీల్లో విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించేందుకే సరిపోయాయి. కార్యదర్శులు వెచ్చించిన మొత్తం ఇంకా పెండింగులోనే ఉన్నాయి. వివిధ పనుల నిమిత్తం ఇప్పటి వరకు వెచ్చించిన డబ్బులు రాకపోగా, మళ్లీ కొత్తగా ఎక్కడి నుంచి తెచ్చేదని కార్యదర్శులు వాపోతున్నారు.

Updated Date - Sep 03 , 2024 | 10:41 PM

Advertising
Advertising