బాధితులకు నమ్మకం కల్పించాలి
ABN, Publish Date - Sep 28 , 2024 | 10:30 PM
రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను సందర్శించి పిటిషన్, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసు లలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, మిస్సింగ్, కైరమ్ కేసులలో ప్రధానమైన సాక్ష్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని సూచించారు.
రామకృష్ణాపూర్, సెప్టెంబరు 28 : రామకృష్ణాపూర్ పోలీస్‌స్టేషన్‌ను సీపీ శ్రీనివాస్ శనివారం ఆకస్మికంగా సందర్శించారు. పోలీస్‌స్టేషన్ పరిసరాలను సందర్శించి పిటిషన్, రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, కేసు లలో ప్లాన్ ఆఫ్ యాక్షన్, మిస్సింగ్, కైరమ్ కేసులలో ప్రధానమైన సాక్ష్యులతో మాట్లాడి వివరాలు సేకరించాలని సూచించారు.
ఎలాంటి నేరాలు అధికంగా జరుగుతున్నాయనే అంశాలను ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలన్నారు. గంజాయి, మత్తు పదార్థాల సరఫరా, విక్రయం, అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా ఉంచాలన్నారు. డయల్ 100కి వెంటనే స్పందించి సంఘటన స్థలానికి త్వరగా చేరుకోవాలని సూచించారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ రవి కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సీఐ శశిధర్ రెడ్డి, ఎస్‌ఐ రాజశేఖర్ ఉన్నారు.
Updated Date - Sep 28 , 2024 | 10:30 PM