ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వ్యర్థాలను పునర్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Sep 28 , 2024 | 10:32 PM

విద్యార్థి దశలో వ్యర్థాలకు అర్ధవంతమైన రూపం తీసుకుని పునర్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సైన్స్‌ కేంద్రంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో వ్యర్ధం నుంచి అర్ధం అనే అం శంపై నిర్వహించిన ఆర్ట్‌, క్రాప్ట్‌ ఎగ్జిబిషన్‌ను డీఈవో యాదయ్యతో కలిసి పారరంభించారు.

గర్మిళ్ల, సెప్టెంబరు 28: విద్యార్థి దశలో వ్యర్థాలకు అర్ధవంతమైన రూపం తీసుకుని పునర్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ సబావత్‌ మోతిలాల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సైన్స్‌ కేంద్రంలో నేషనల్‌ గ్రీన్‌ కోర్‌ ఆధ్వర్యంలో వ్యర్ధం నుంచి అర్ధం అనే అం శంపై నిర్వహించిన ఆర్ట్‌, క్రాప్ట్‌ ఎగ్జిబిషన్‌ను డీఈవో యాదయ్యతో కలిసి పారరంభించారు. అదనపు కలె క్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు వ్యర్ధంగా పడేసిన పేపర్లు, ప్లాస్టిక్‌, కొబ్బరి పెంకు లు, గాజు ముక్కలు, పల్లి, పిస్తా పొట్టు వంటి వాటిని ఉపయోగించి అందంగా అలంకరణ వస్తువులు తయారు చేసి ఎగ్జిబిషన్‌లో ప్రదర్శించడం అబ్బురపరి చిందన్నారు.

డీఈవో యాదయ్య మాట్లా డుతూ మొత్తం 54 పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొని వస్తువులను ప్రద ర్శించారని తెలిపారు. మొదటి బహుమ తి రూ.3 వేలు, ద్వితీయ రూ. 2 వేలు, తృతీయ రూ.వెయ్యి, ఐదుగురికి రూ.200 చొప్పున అందించామన్నారు. జిల్లా సైన్స్‌ అధికారి మధుబాబు, ఎన్జీసీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ విద్యాసాగర్‌, సెక్టోరియల్‌ అధికారులు చౌదరి, సత్యనారాయణ ప్రధానోపాధ్యా యులు దత్తకుమార్‌, సత్యనారాయణ, ఉపాధ్యా యులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 10:32 PM