ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాం

ABN, Publish Date - Sep 06 , 2024 | 10:49 PM

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వం శీకృష్ణ అన్నారు. శుక్రవారం 5వ వార్డు గెర్రె కాలనీలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా రూ.31 కోట్లతో నిర్మిం చనున్న వాటర్‌ ట్యాంకు పనులను ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు.

చెన్నూరు, సెప్టెంబరు 6: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వం శీకృష్ణ అన్నారు. శుక్రవారం 5వ వార్డు గెర్రె కాలనీలో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా రూ.31 కోట్లతో నిర్మిం చనున్న వాటర్‌ ట్యాంకు పనులను ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ వెంకటస్వామితో కలిసి ప్రారంభించారు. ఎంపీ మాట్లా డుతూ వాటర్‌ ట్యాంకు ద్వారా 2 వేల కుటుంబాలకు నల్లా కనెక్షన్‌లు ఇచ్చి ఇంటింటికి తాగు నీరందిస్తామన్నారు. ట్యాంకు నిర్మాణాన్ని నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులు, గుత్తేదారుకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మె ల్యే వివేక్‌వెంకటస్వామి మాట్లాడుతూ నాలుగు సంవత్స రాల్లో నియోజకవర్గంలో మిషన్‌ భగీరథ పథకం ఫెయి ల్యూర్‌ అయ్యిందన్నారు. మిషన్‌ భగీరథ పథకంలో రూ.40 వేల కోట్లు ఖర్చు చేసి గత ప్రభుత్వం కమీషన్లు దండు కుందన్నారు. సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి, మం త్రుల దృష్టికి తీసుకువెళ్లి నియోజకవర్గానికి ఎక్కువ నిధు లు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌కుమార్‌ పాల్గొన్నారు.

శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి సుద్దాల, కమ్మర్‌పల్లి, తుర్కపల్లి గ్రామాల్లో మార్నింగ్‌ వాక్‌ నిర్వహించారు. గ్రామస్థులు ఎమ్మెల్యేకు సమస్యలను వెల్ల డించారు. మౌలిక సదుపాయాలతోపాటు అంతర్గత రహ దారులు, డ్రైనేజీల నిర్మాణానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యేల ముందే బాహాబాహి

అమృత్‌ 2.0 పథకంలో భాగంగా పలు అభివృద్ధి పనుల్లో ఎంపీ, ఎమ్మెల్యే పాల్గొనగా వారి ఎదుటే భీమా రం-చెన్నూరుకు చెందిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బాహా బాహికి దిగారు. భీమారం మండలానికి చెందిన కాంగ్రెస్‌ నాయకులు చేకుర్తి సత్యనారాయణరెడ్డి రాగా అక్కడ ఉన్న జిల్లా పరిషత్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మూలరాజిరెడ్డి భీమారం నాయకులకు ఇక్కడ ఏమి అవసరమని గొడవకు దిగారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామి వారితో మాట్లాడడంతో గొడవ సద్దుమణిగింది.

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

రామకృష్ణాపూర్‌: క్యాత న్‌పల్లి మున్సిపాలిటీకి అమృత్‌ 2.0 పథకంలో భాగంగా రూ.41.5 కోట్ల నిధులతో తాగు నీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. అమ్మ గార్డెన్స్‌ సమీపంలో నిర్మించే వాటర్‌ ట్యాంకుకు కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌, శాసన సభ్యులు గడ్డం వివేకానంద, మున్సిపల్‌ కమిషనర్‌ మురళీ కృష్ణ, చైర్‌పర్సన్‌ జంగం కళలతో కలిసి భూమి పూజ చేశారు. ఎంపీ మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రభు త్వం చేపట్టిన పథకాలను లబ్ధిదారులకు అందించే విధంగా అధికార యంత్రాంగంతో కలిసి పని చేస్తామని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఎమ్మార్వో సతీష్‌ కుమార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సాగర్‌రెడ్డి, కౌన్సిలర్‌ తిరుపతి, పార్టీ పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, పీసీసీ ప్రధాన కార్య దర్శి రఘునాథ్‌ రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 10:49 PM

Advertising
Advertising