ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Sep 17 , 2024 | 10:56 PM

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్‌పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు.

నెన్నెల, సెప్టెంబరు 17: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మహాలక్ష్మి పథకం ఎల్‌పీజీ సబ్సిడీ పత్రాల పంపిణీలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అ ర్హులైన వారికి రూ.500లకే వంట గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు. సిలిండర్‌ తీసుకున్న నాలుగు రోజుల్లో రాయితీ డబ్బులు జమ కాకుంటే సమాచారం ఇవ్వాలని సూచించారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, త్వరలోనే అర్హులైన వారందరికి రేషన్‌ కార్డులు అందజేస్తామని పేర్కొన్నారు. అనంతరం మదర్‌ ప్రతిభ స్వచ్ఛంద సంస్థలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. తహసీల్దార్‌ సబ్బ రమేష్‌, ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు గట్టు మల్లేష్‌, నాయకులు బొమ్మెన హరీష్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ తారాచంద్‌, మాజీ సర్పంచ్‌ సుజాతశ్రీనివాస్‌, చెన్నోజు శంకరయ్య, పాల్గొన్నారు. కుశ్నపల్లి కాంగ్రెస్‌ నాయకుడు బెల్లంపల్లి మహేశ్వర్‌ రెడ్డి తండ్రి మల్లా రెడ్డి ఇటీవల మృతి చెందగా ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

బెల్లంపల్లి: కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సద్విని యోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. మున్సిపల్‌ కార్యాల యంలో మహాలక్ష్మి పథకం కింద మంజూరైన గ్యాస్‌ సబ్సిడీ పత్రాలను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ప్రభుత్వం ప్రతీ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తుందన్నారు. మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జక్కులశ్వేత, కమిషనర్‌ శ్రీనివాస్‌, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 17 , 2024 | 10:56 PM

Advertising
Advertising