ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ABN, Publish Date - Nov 17 , 2024 | 10:23 PM

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం నీల్వాయి, గొర్లపల్లి గ్రామాల్లో ఎస్‌డీఎఫ్‌ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వేమనపల్లి ఎంపీడీవో కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అంద జేశారు.

వేమనపల్లి, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి పేర్కొన్నారు. ఆదివారం నీల్వాయి, గొర్లపల్లి గ్రామాల్లో ఎస్‌డీఎఫ్‌ నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులను ప్రారంభించారు. అనంతరం వేమనపల్లి ఎంపీడీవో కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ చెక్కులను అంద జేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం పథకాలను అమలు చేస్తుందని, వీటిని గ్రామాల్లోని అర్హులకు అందేలా స్ధానిక నాయకులు, కార్యకర్తలు చూడాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. సీఎం రేవం త్‌రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందు తుందన్నారు. కులగణన సర్వేకు ప్రజలు సహకరిం చాలన్నారు. ఎంపీడీవో దేవేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ టీసీఆర్‌. సంతోష్‌కు మార్‌, పార్టీ మండల అధ్యక్షుడు సాబీర్‌ ఆలీ, మాజీ సర్పంచు గాలి మధు, కాంగ్రెస్‌ నాయ కులు పూర్ణచంద్రరెడ్డి, తిరుపతిరెడ్డి, మధుసూ దన్‌, రెవెన్యూ సిబ్బంది , కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

బెల్లంపల్లి, (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే వినోద్‌ అన్నారు. వంద పడ కల ఆసుపత్రిలో విలేకరుల సమావేశం లో మాట్లాడారు. ఉచిత వైద్య శిబిరంలో వెయ్యి మంది పాల్గొన్నారని, ఇందులో వంద మందికి కంటి ఆపరేషన్‌ లు చేయించగా మరో 200 మందికి కళ్లద్దాలను పంపిణీ చేశామన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైద్య శిబిరాలను నిర్వహిస్తామన్నారు. రైతులు, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ఎమ్మెల్యే సతీమణి రమాదేవి, కూతురు వర్షతో కలిసి కళ్లద్దాలను పంపిణీ చేశారు. పట్టణాధ్యక్షుడు మల్లయ్య, కౌన్సిలర్‌ బండి ప్రభాకర్‌, మాజీ ఎంపీటీసీ హరీష్‌గౌడ్‌ , రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కమ్యూనిటీ హాల్‌ ఏర్పాటు చేయాలి

కాసిపేట, (ఆంధ్రజ్యోతి): ధర్మారావు పేట యాదవ సంఘానికి కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలని ఆదివారం ఎమ్మెల్యే వినో ద్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. నాయకులు ముత్యాల రాజమొగిలి మాట్లాడుతూ ధర్మారావుపేటలో అత్యధికంగా యాదవ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారన్నారు. కమ్యూనిటీ హాలు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. చిలువేరు రమేష్‌, పవయ్య, కొమురయ్య, భీమయ్య, పాల్గొన్నారు.

భీమిని, (ఆంధ్రజ్యోతి): అర్హులైన వారందరూ కల్యాణలక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్‌ అన్నారు. రైతు వేదిక వద్ద భీమిని, కన్నెపల్లి మండలాలకు చెందిన లబ్ధిదారులకు చెక్కు లను అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేసే పథకాలు ప్రతీ ఒక్కరికీ అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. భీమిని, కన్నెపల్లి మండల అధ్య క్షులు గాధం లక్ష్మీనారాయణ, రామాంజనేయులు, సీని యర్‌ నాయకులు నర్పింగరావు, నాయకులు రవిందర్‌ రావు, మహేశ్వర్‌ గౌడ్‌, సతీష్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 10:23 PM