ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లించేదెప్పుడో...?

ABN, Publish Date - Sep 12 , 2024 | 10:52 PM

ప్రైవేట్‌ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (బోధనా రుసుం) విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ళుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, ఉపకార వేతనాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తు న్నాయి.

మంచిర్యాల, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ కళాశాలల్లో విద్యను అభ్యసిస్తున్న పేద, మధ్య తరగతి విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (బోధనా రుసుం) విడుదల కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మూడేళ్ళుగా ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌ మెంట్‌, ఉపకార వేతనాలను విడుదల చేయడంలో తీవ్ర జాప్యం చేస్తు న్నాయి. ప్రభుత్వం అందజేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌పైనే ఆధారపడి ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు అర్హతగల విద్యార్థులకు ఉచిత విద్యా బోధన చేస్తున్నాయి. ఇందుకుగాను బోధనకు అయ్యే ఖర్చులన్నీ యాజ మాన్యాలు భరిస్తున్నాయి. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేస్తే చేసిన అప్పులతోపాటు తమ ఖర్చులకు ఇబ్బందులు ఉండవని సంవత్సరాల తరబడి వేచి చూస్తున్నాయి. అయినా ప్రభుత్వాల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆయా కళా శాలల యాజమాన్యాలు ఫీజు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తెస్తు న్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాగానే తిరిగి డబ్బు వాపసు ఇస్తామని చెబుతున్నాయి.

రూ. 40.02 కోట్ల మేర బకాయిలు

జిల్లాలో 2020-21 నుంచి 2023-24 వరకు మూడు సంవత్సరాల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, పీజీ విద్యార్థులు 20 వేల వరకు ఉండగా, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు రూ.40.02 కోట్ల రూపాయల వరకు బకాయిలు పేరుకుపోయాయి. బీసీ సంక్షేమ శాఖ ద్వారా బీసీ విద్యార్థు లకు రావలసిన బకాయిలు రూ.20.86 కోట్లు ఉన్నాయి. ఈ బకాయిలు ఇలా ఉండగానే కొత్తగా చేరుతున్న విద్యార్థులు మళ్లీ దరఖాస్తు చేసుకుం టున్నారు. మైనారిటీ కేటగిరీ కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు రూ.4.81 కోట్లు మంజూరు కావలసి ఉంది. ఎస్సీ సంక్షేమ శాఖలో రూ.8.31 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా రూ.5.85 కోట్ల బకాయిలు ఉన్నాయి. మూడేళ్లుగా ఈ బకాయిలన్నీ పేరుకుపోగా ప్రభుత్వాలు నిధులు విడుదల చేయడం లేదు. దీంతో అధ్యాపకుల వేతనాలు చెల్లించి, కళాశాలలు నడిపించడం కష్టంగా మారిందని ప్రైవేట్‌ యాజమాన్యాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బకాయిల్లో సగ భాగం నిధులు విడుదల అయినట్లు పేర్కొని ఏడాది కావస్తున్నా విద్యార్థుల ఖాతాల్లో మాత్రం ఆ నగదు జమ కాలేదు. దీంతో విద్యార్థులు, పైవ్రేట్‌ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులకు గురుతున్నారు.

సర్టిఫికెట్లు అందక ఇబ్బందులు

ప్రభుత్వం అందజేసే ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలపై ఆధారపడి జూనియర్‌, డిగ్రీ విద్యను పూర్తిచేసుకొని సర్టిఫికెట్‌ తీసుకోవల సిన విద్యార్థులు బకాయిలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులు రాకపోవడంతో ఆ డబ్బు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని, ప్రభుత్వం నుంచి నిధులు రాగానే చెల్లించిన డబ్బు వాపసు చేస్తామని యాజమాన్యాలు చెబుతున్నట్లు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం విద్యాసంస్థల జేఏసీ ఆందోళనకు దిగేందుకు సిద్ధమై ప్రభుత్వానికి నోటీసులు కూడా అందజేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయాలని టీజేఏసీ పైవ్రేట్‌ కళాశాలల యాజమాన్యాలకు పిలుపునిచ్చిం ది. ప్రభుత్వం వెంటనే ఈ నిధుల చెల్లింపుపై దృష్టి సారించి తమ చదువులకు ఆటంకం లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇబ్బందుల్లో యాజమాన్యాలు

నర్సయ్య, తెలంగాణ ప్రైవేటు డిగ్రీ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌

ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు విడుదల చేయకపోవడంతో యాజమాన్యాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. జిల్లాలో ఒకప్పుడు 14 డిగ్రీ, 14 జూనియర్‌ కళాశాలు ఉంటే... ప్రస్తుతం 5 చొప్పున మిగిలాయి. దీనికి కారణం ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ విడుదల చేయకపోవడమే. ప్రభుత్వ కళాశాలల్లో డేటా సైన్స్‌, ఫుడ్‌ సైన్స్‌, డైరీ సైన్స్‌, బీబీఏ తదితర కోర్సులు అందుబాటులో లేవు. ప్రైవేటులో మాత్రమే ఉన్నాయి. కళాశాలలు ఎత్తివేయడంతో విద్యార్థులు ఆ విభాగాల్లోని విద్యకు దూరమవుతున్నారు. ప్రైవేటులో బస్సుల వెసలుబాటు ఉండటం వల్ల విద్యార్థులు ప్రైవేటు విద్యపై మొగ్గు చూపుతారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉపకార వేతనాలు విడుదల చేయడం ద్వారా కళాశాలలను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - Sep 12 , 2024 | 10:52 PM

Advertising
Advertising