ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫోర్జరీ సంతకాలతో విరాసత్‌కు యత్నం

ABN, Publish Date - Sep 06 , 2024 | 10:53 PM

మరణించిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్‌ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంఘటన దండేపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ తతంగం తహసీ ల్దార్‌ కార్యాలయ సిబ్బందే నడిపించగా, విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మంచిర్యాల, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): మరణించిన వారి సంతకాలు ఫోర్జరీ చేసి భూమిని విరాసత్‌ చేసుకోవాలని చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టిన సంఘటన దండేపల్లి మండలంలో వెలుగు చూసింది. ఈ తతంగం తహసీ ల్దార్‌ కార్యాలయ సిబ్బందే నడిపించగా, విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయాల్సి ఉండగా, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు చేస్తన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కార్యాలయ సిబ్బంది ప్రోత్సాహంతోనే...

దండేపల్లి మండల కేంద్రానికి చెందిన గొర్రె జానీకి 1.18 ఎకరాల భూమి ఉంది. ఆయనకు ఇద్దరు కుమారులు పౌల్‌, స్వామి ఉన్నారు. జానీ ఆనారోగ్యం కారణంగా 2012లో మరణించగా, అతని భార్య మరియ గతేడాది సెప్టెంబరులో చనిపోయింది. పెద్ద కుమారుడు పౌల్‌ 2024 జనవరి 6న అనారోగ్యంతో మరణించాడు. పౌల్‌ భార్య ఏసుమణికి తెలియకుండా తండ్రి పేరిట ఉన్న భూమిని రెండో కుమారుడు స్వామి విరాసత్‌ చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు. 2023 ఏప్రిల్‌ 28న మీ సేవాలో స్వామి దరఖాస్తు చేసుకున్నాడు. ఒకరి పేరిట ఉన్న భూమిని ఇతరుల పేరిట విరాసత్‌ చేయాలంటే నిబంధనల మేరకు అంతకు ముందు పట్టా కలిగి ఉన్న వారి స్టేట్‌మెంట్‌ రికార్డు చేయాల్సి ఉంటుంది. జానీ కుటుంబం విషయంలోనూ ఇదే నిబంధన అమలు చేయాల్సి ఉండగా అప్పటికే చనిపోయిున పౌలు, అతని తల్లి మరియ సంతకాలను ఫోర్జరీ చేశారు. ఫోర్జరీ సంతకాలతో కూడిన ఫైల్‌ను 14 నెలల తరువాత 2024 జూన్‌లో తహసీల్దార్‌కు అందజేశారు. దరఖాస్తు అందిన తరువాత మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఎంఆర్‌ఐ) స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన అనంతరం మరణించిన వారి కుటుంబ సభ్యుల సమక్షంలో పంచనామా చేయాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల సంతకాలు సేకరించిన అనంతరం సదరు ఫైల్‌ను తహసీల్దార్‌ లాగిన్‌లో పొందుపర్చాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తుపై ఎవరు సంతకం చేశారో నిర్ధారించకుండానే తహసీల్దార్‌ లాగిన్‌లో పొందుపర్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ తతంగంలో పెద్ద మొత్తంలో చేతులు మారినట్లు ప్రచారం జరుగుతోంది.

విరాసత్‌ కోసం కలెక్టర్‌ వద్దకు ఫైలు...

ఆర్‌ఐ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తహసీల్దార్‌ సంబంధిత ఫైల్‌ అప్రోవల్‌ కోసం మంచిర్యాల ఆర్డీవో కార్యాలయానికి పంపించారు. అక్కడి నుంచి జిల్లా కలెక్టర్‌ లాగిన్‌కు సైతం వెళ్లింది. అనుమానం వచ్చిన కలెక్టర్‌ కార్యాలయం సిబ్బంది దాన్ని తిరస్కరించారు. ఈ లోగా ఫోర్జరీ సంతకాలతో విరాసత్‌ కోసం దరఖాస్తు చేశారనే విషయం బయటకు పొక్కడంతో అప్రమత్తమైన తహసీల్దార్‌ అప్రోవల్‌ చేసిన ఫైలును రద్దు చేశారు. అనంతరం తహసీల్దార్‌ ఆర్‌ఐపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. ఆర్‌ఐ చంద్రమౌళి కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు విషయంలో తనను తప్పుదారి పట్టించారని పేర్కొంటూ గత నెల 31న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆర్‌ఐకి మెమో జారీ....

విరాసత్‌ విషయంలో దరఖాస్తు దారుని కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్‌ రికార్డు చేయడంలో నిర్లక్ష్యం వహించిన ఆర్‌ఐ చంద్రమౌళికి తహసీల్దార్‌ మెమో జారీ చేశారు. ఈ విషయమై తహసీల్దార్‌ సంధ్యారాణిని ఫోన్‌లో వివరణ కోరగా, స్టేట్‌మెంట్‌ రికార్డు విషయంలో నిర్లక్ష్యం వహించినందునే ఆర్‌ఐకి సంజాయిషీ ఇవ్వాలని మెమో జారీ చేసినట్లు తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు వెనుకంజ....?

తహసీల్దార్‌ ఆదేశాల మేరకు ఆర్‌ఐ స్వయంగా ఫిర్యాదు చేసినా పోలీసులు కేసు నమోదు చేయడం లేదనే అపవాదు ఉంది. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు కేసు నమోదు చేయడం లేదనే ప్రచారం జరుగుతోంది. దండేపల్లి ఎస్సై ఉదయ్‌కిరణ్‌ వివరణ కోరగా ఫిర్యాదు స్పష్టంగా లేకపోవడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదులో కొంత ఆలస్యం జరిగిందని, ఫోర్జరీ చేసిన వారిపై వెంటనే కేసు పెడుతున్నట్లు తెలిపారు.

Updated Date - Sep 06 , 2024 | 10:53 PM

Advertising
Advertising