మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా కృషి
ABN, Publish Date - Oct 17 , 2024 | 11:45 PM
మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మహిళలు వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెం దేందుకు ప్రోత్సహిస్తున్నామని, ఈ క్రమంలో జిల్లాలో క్యాంటీన్‌లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు హైద్రాబాద్‌లో శిక్షణ ఇచ్చారు.
మంచిర్యాల కలెక్టరేట్, అక్టోబరు 17 (ఆంధ్ర జ్యోతి): మహిళల ఆర్థిక స్వావలంబన దిశగా ప్రభుత్వం ఇందిరా మహిళ శక్తి పథకం ద్వారా కృషి చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మహిళలు వ్యాపారాల్లో ఆర్థికంగా అభివృద్ధి చెం దేందుకు ప్రోత్సహిస్తున్నామని, ఈ క్రమంలో జిల్లాలో క్యాంటీన్‌లు, ఈవెంట్ మేనేజ్‌మెంట్ యూనిట్లను ఎంపిక చేసుకున్న లబ్ధిదారులకు సెప్టెంబరు 19 నుంచి 28 వరకు హైద్రాబాద్‌లో శిక్షణ ఇచ్చారు. వారికి గురువారం కలెక్టరేట్‌లో ధ్రువపత్రాలు అందజేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం మహిళ శక్తి క్యాంటీన్‌లు, డైరీఫార్మ్, కోళ్లు, చేపల పెంపకం వివిధ యూనిట్ల స్ధాపనకు అవకాశం కల్పిస్తున్నామన్నారు. మహిళ శక్తి క్యాంటీన్ యూనిట్లను ఎంపిక చేసుకున్న లక్షెట్టి పేటకు చెందిన జమున, హాజీపూర్ చెందిన జ్యోతి, ఈవెంట్ మేనేజ్‌మెంట్ గుడిపేటకు చెందిన ధనలక్ష్మీకి ధ్రువపత్రాలు అందజేశారు. డీఆర్‌డీవో కిషన్, అధికారులు పాల్గొన్నారు.
Updated Date - Oct 17 , 2024 | 11:45 PM