ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయ భూములను రక్షించాలని రాస్తారోకో

ABN, Publish Date - Nov 03 , 2024 | 10:35 PM

పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయ భూములను రక్షించాలని బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ గతం లో ఆలయ భూములను కబ్జా చేశారని కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారని, అదికారులు సర్వేచేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపారన్నారు.

బెల్లంపల్లిరూరల్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఉన్న అభయాంజనేయస్వామి ఆలయ భూములను రక్షించాలని బీజేపీ నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ మాట్లాడుతూ గతం లో ఆలయ భూములను కబ్జా చేశారని కమిటీ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారని, అదికారులు సర్వేచేసి నివేదికను ఉన్నతాధికారులకు పంపారన్నారు.

కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు భూమి కబ్జా చేయడానికి చూస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఎలాంటి ఉత్త ర్వులు ఇవ్వకుండానే ఎక్స్‌కావేటర్‌తో ఆలయ భూములను చదును చేసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి తెరలేపుతున్నారన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ముసుగులో ఉన్న కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. పులగం తిరుపతి, కేశవరెడ్డి, దూది ప్రకాష్‌, శ్రీనివాస్‌, దీపారాణి, అశోక్‌, కొండబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 03 , 2024 | 10:35 PM