ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

లంచం కొట్టు.. జీతం పట్టు!

ABN, Publish Date - Oct 30 , 2024 | 03:37 AM

అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అడ్మినిస్ర్టేటీవ్‌ ఆఫీసర్‌(ఏవో) ఖలీలుల్లా, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు.

  • అవినీతి పర్వం

  • రూ.15 లక్షలు ఇస్తేనే ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు

  • కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ ఏవో, జూనియర్‌ అసిస్టెంట్‌ డిమాండ్‌

  • ఏసీబీకి ఔట్‌ సోర్సింగ్‌ ఏజెన్సీ ఫిర్యాదు

  • నిందితులను పట్టుకున్న అధికారులు

కొత్తగూడెం పోస్టాఫీస్‌ సెంటర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాల చెల్లింపు కోసం లంచం తీసుకుంటూ భద్రాద్రి జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అడ్మినిస్ర్టేటీవ్‌ ఆఫీసర్‌(ఏవో) ఖలీలుల్లా, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌ మంగళవారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ కళాశాలలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో సదరు ఏజెన్సీ యాజమాన్యం మెడికల్‌ కళాశాలను, జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించింది. దీంతో ఏవో రెండున్నర నెలల జీతాల బిల్లులను మంజూరు చేశారు. అయితే, సరైన ధ్రువపత్రాలు లేవంటూ 23 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను తొలగించగా వారికి కూడా పని చేసిన కాలానికి జీతాలివ్వాలని ఆ ఏజెన్సీ కోరింది. దీంతో మొత్తం 49 మంది అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు రూ.15 లక్షలు లంచం ఇవ్వాలని ఏవో, జూనియర్‌ అసిస్టెంట్‌ డిమాండ్‌ చేశారు. రూ.7 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్న ఆ ఔట్‌సోర్సింగ్‌ ఏజెన్సీ యాజమాన్యం ఏసీబీని ఆశ్రయించింది. ఏబీసీ అధికారుల సూచన మేరకు.. ఆ ఏజెన్సీ వారు రూ.3 లక్షలను మెడికల్‌ కళాశాల ఏవో ఖలీలుల్లా, జూనియర్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌లకు ఇవ్వగా.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌ తెలిపారు

Updated Date - Oct 30 , 2024 | 03:37 AM