ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bathukamma: ఆరోరోజు అలిగిన బతుకమ్మ... ఎందుకు అలిగిందో తెలుసా

ABN, Publish Date - Oct 07 , 2024 | 09:30 AM

Telangana: ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

Bathukamma Festival

తెలంగాణలో బతుకమ్మ (Bathukamma) సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే ఐదు రోజుల పాటు ఒక్కో పేరుతో బతుకమ్మను జరుపుకున్నారు తెలంగాణ ఆడపడుచులు. తొలిరోజు ఎంగిలి బతుకమ్మతో మొదలైన సంబురాలు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. తొలిరోజు ఎంగిలి బుతుకమ్మ, రోండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఇలా వరుసగా ఐదురోజులు ఒక్కో పేరుతో బతుకమ్మను పేర్చి ఆడిపాడారు మహిళలు. ప్రతీరోజు ఒక్కో నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పించారు. తీరొక్క పువ్వుతో బతుకమ్మను త్రికోణంలో లేదా వలయాకారంలో చేసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడిపాడారు మహిళలు. ఇక ఆరవరోజైన ఈరోజుకు అలిగిన బతుకమ్మ అని పేరు. ఇంతకీ బతుకమ్మకు ఈ పేరు ఎలా వచ్చింది... బతుకమ్మ ఎందుకు అలిగింది... ఈరోజు ఎందుకు బతుకమ్మను చేయరో ఇప్పుడు తెలుసుకుందాం.

Hardik Pandya: పిచ్చెక్కిస్తున్న హార్దిక్ పాండ్యా ఫినిషింగ్ స్టైల్.. వీడియో వైరల్


అలిగిన బతుకమ్మ

ఆశ్వయుజ శుద్ధ పంచమి (సోమవారం) నాడు అలిగిన బతుకమ్మగా వ్యవహరిస్తారు. పూర్వకాలంలో బతుకమ్మలను పేర్చే సమయంలో మాంసం ముద్ద తగిలి అపచారం జరిగిందట. అందుకని ఈ రోజు బతుకమ్మ అలిగి ఏదీ తినదంటారు. కాబట్టి ఈ రోజు పూలతో బతుకమ్మలను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా ఏదీ సమర్పించరు. బతుకమ్మ అలక తీరాలని మహిళలందరూ కలిసి ప్రార్థిస్తారు.

Blast: కరాచీ విమానాశ్రయ పేలుడు ఘటనపై.. చైనా ఆగ్రహం


అలిగిన బతుకమ్మపై మరో కథ...

అలిగిన బతుకమ్మపై మరో చరిత్ర కూడా ఉంది. దేవీభాగవతం ప్రకారం నవరాత్రుల్లో అమ్మవారు మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి రూపాల్లో రాక్షస సంహారం చేసిందని చెబుతారు. భండాసురుణ్ని, చండముండల్ని సంహరించిన తర్వాత అలసిపోయిన అమ్మవారికి ఒక రోజు విశ్రాంతి ఇవ్వాలని ఆరోనాడు బతుకమ్మ ఆడరు. దానినే అర్రెం అనీ, అలసిన బతుకమ్మ అని పిలుస్తారు. కాలక్రమంలో అదే అలిగిన బతుకమ్మగా పేరు స్థిరపడిపోయింది.

Gold and Silver Rates: బంగారం కొనాలనుకుంటున్నారా.. ఇదే మంచి సమయం..


మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు కూడా వైభవంగా జరుగుతున్నాయి. ఐదవరోజుకు దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు చేరుకున్నాయి. తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఒక్కో ఆలయంలో ఒక్కో అలంకరణలో భక్తులకు దర్శమనిస్తుంటారు అమ్మవారు. అమ్మవారిని దర్శించుకునేందుకు తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు తరలివెళ్తారు. దుర్గాష్టమితో నవరాత్రి ఉత్సవాలు ముగియనున్నాయి.


ఇవి కూడా చదవండి...

AGE Compounds: భారతీయులకు ఈ ఫుడ్స్ వల్లే షుగర్.. ఐసీఎమ్ఆర్ అధ్యయనంలో వెల్లడి

Viral: భారతీయులకే జాబ్స్ ఇస్తున్నారు.. కెనడా శ్వేతజాతీయురాలి సంచలన ఆరోపణ

Read Latest Devotional News And Telangana News And Telugu News

Updated Date - Oct 07 , 2024 | 09:48 AM