ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: బస్తీ, పల్లె దవాఖానల్లో ఆయుష్‌ వైద్యులదే హవా!

ABN, Publish Date - Dec 16 , 2024 | 04:10 AM

రాష్ట్రంలోని బస్తీ, పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్‌ వైద్యుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. వారి స్థానాన్ని ఆయుష్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు ఆక్రమించేస్తున్నారు. అయితే, ఆయా దవాఖానల్లో ఆయుష్‌ వైద్యుల సంఖ్య పెరగడం వెనుక జిల్లా వైద్యాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

  • తగ్గిపోతున్న ఎంబీబీఎస్‌ డాక్టర్లు

  • ‘ఆయుష్‌’ వైపే డీఎంహెచ్‌వోల మొగ్గు

  • వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు

హైదరాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని బస్తీ, పల్లె దవాఖానల్లో ఎంబీబీఎస్‌ వైద్యుల సంఖ్య క్రమేణా తగ్గిపోతోంది. వారి స్థానాన్ని ఆయుష్‌ వైద్యులు, స్టాఫ్‌ నర్సులు ఆక్రమించేస్తున్నారు. అయితే, ఆయా దవాఖానల్లో ఆయుష్‌ వైద్యుల సంఖ్య పెరగడం వెనుక జిల్లా వైద్యాధికారుల హస్తం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్కో ఆయుష్‌ వైద్యుడి దగ్గర లక్షల్లో డబ్బులు తీసుకుని దొడ్డిదారిన డీఎంహెచ్‌వోలు వారిని పల్లె, బస్తీ దవాఖానాల్లో నియమిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. దానికితోడు మెడికల్‌ ఆఫీసర్‌గా పిలవాల్సిన ఎంబీబీఎస్‌ వైద్యులను మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ)గా పేర్కొనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి 2021లో బస్తీ, పల్లె దవాఖానల్లో మెడికల్‌ ఆఫీసర్ల(ఎంబీబీఎస్‌ డాక్టర్ల)నే నియమించాలని అప్పటి బీఆర్‌ఎస్‌ సర్కారు జీవో 558ను తీసుకొచ్చింది. దాంతో తొలి విడతలో వెయ్యి పోస్టులకు 700 మంది ఎంబీబీఎస్‌ వైద్యులు చేరారు. పల్లె దవాఖానాల సంఖ్య పెరగడంతో ఆ మరుసటి ఏడాదే సర్కారు మరో జీవో తీసుకొచ్చింది. దీని ప్రకారం ఒకవేళ ఎంబీబీఎస్‌ వైద్యులు అందుబాటులో లేకున్నా, దరఖాస్తు చేయకున్నా... తదుపరి ప్రాధాన్యత కింద ఆయుష్‌ వైద్యులు, బీఎస్సీ నర్సింగ్‌ పూర్తి చేసిన స్టాఫ్‌ నర్సులకు అవకాశం ఇవ్వాలని పేర్కొంది. ఆ జీవోలోని లొసుగులనే జిల్లా వైద్యాధికారులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు.


ఖాళీగా ఉండే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు ఎంబీబీఎస్‌ వైద్యులు దరఖాస్తు చేసుకుంటే... తదుపరి ప్రక్రియను ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారు. దీంతో ఎంబీబీఎస్‌ వైద్యులు ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్‌ వైద్యులు అందుబాటులో లేరన్న సాకు చూపుతూ ఆయుష్‌ వైద్యులను డీఎంహెచ్‌వోలు నియమిస్తున్నారు. గౌరవ వేతనంతోపాటు వెయిటెజీ మార్కులు వస్తుండడంతో ఆ పోస్టుల కోసం డబ్బులు చెల్లించేందుకూ ఆయుష్‌ వైద్యులు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అదనుగా కొందరు డీఎంహెచ్‌వోలు ఒక్కో పోస్టుకు రూ.2-3 లక్షలు వసూలు చేస్తున్నట్లు ప్రజారోగ్య విభాగంలో పనిజేసే కొందరు వైద్యులు చెబుతున్నారు. దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాఽధికారులు ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినినిస్తున్నాయి. నిజానికి మన దగ్గర చాలా మంది నిరుద్యోగ ఎంబీబీఎ్‌సలు ఉన్నారు. వారికి ప్రైవేటులో కనీసం రూ.20-25వేల వేతనం కూడా రావడం లేదు.


కాంట్రాక్ట్‌ ఎంఎల్‌హెచ్‌పీలకు సుమారుగా రూ.42వేల వేతనం అందుతుంది. అయితే, డీఎంహెచ్‌వోల కక్కుర్తి వల్లే ఎంబీబీఎ్‌సలు ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులపై ఆసక్తి చూపడం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ ఏడాది మార్చి చివరి నాటికి మొత్తం ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో కేవలం 10 శాతం మంది ఎంబీబీఎస్‌ వైద్యులే పని చేస్తుండగా, ఆయుష్‌ వైద్యులు 34శాతం, స్టాఫ్‌నర్సులు 36 శాతం, హోమియో వైద్యులు 4 శాతం మంది పని చేస్తున్నారు. మిగిలిన పోస్టులు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇక, ఈ ఏడాది నవంబర్‌ మొదటి వారం నాటికి బస్తీ, పల్లె దవాఖానాల్లో ప నిచేసే ఎంబీబీఎస్‌ వైద్యుల శాతం 8కి పడిపోగా.. ఆయుష్‌ వైద్యుల శాతం 36కు, స్టాఫ్‌నర్సుల శాతం 38కి పెరిగింది. నిజానికి ఆయుష్‌ వైద్యులు అల్లోపతి వైద్యం చేయకూడదన్న నిబంధనలున్నాయి. కానీ బస్తీ, పల్లె దవాఖానాల్లోని ఆయుష్‌ వైద్యులు అల్లోపతి మెడిసిన్‌ రాస్తున్నారు. దీన్ని అటు వైద్య ఆరోగ్యశాఖ కానీ, ఇటు ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు.

Updated Date - Dec 16 , 2024 | 04:10 AM