ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kaleswaram: కాళేశ్వరం ఎస్సైపై లైంగిక వేధింపుల ఆరోపణలు..

ABN, Publish Date - Jun 19 , 2024 | 08:22 AM

మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారట.

జయశంకర్ భూపాలపల్లి: మహాదేవపూర్ మండలం కాళేశ్వరం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న భవాని సేన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ కానిస్టేబుల్‌పై వరుసగా అత్యాచారానికి పాల్పడినట్టు సమాచారం. ఎవరికైనా ఈ విషయం చెప్తే తుపాకీతో చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారట. సదరు మహిళ కానిస్టేబుల్ జిల్లా ఎస్పీని కలిసి తమ గోడును వెళ్లబోసుకున్నట్లు సమాచారం. కాళేశ్వరం పోలీస్ స్టేషన్‌లో నిన్న రాత్రి ఇద్దరు డీఎస్పీలు, సీఐల ఆధ్వర్యంలో ఎస్సై లైంగిక వేధింపులపై విచారణ జరిగినట్టు తెలుస్తోంది.


విచారణలో ముగ్గురు మహిళ కానిస్టేబుళ్లు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారని తేలినట్లు సమాచారం. ప్రస్తుతం సదరు ఎస్సై పోలీస్ కస్టడీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనపై లైంగిక వేధింపులు, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయనున్నట్లు సమాచారం. సదరు ఎస్సై సర్వీస్ రివాల్వర్‌ను డీఎస్పీ స్వాధీనం చేసుకున్నారు. గతంలో ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలోనూ ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో ఆయనపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. రెబ్బెన పోలీస్ స్టేషన్ పరిధిలో భర్త చేసిన అవమానాన్ని భరించలేక ఎస్సై భార్య ఆత్మహత్య యత్నం చేసుకున్న వైనం. అయినా ఎస్సై భవాని సేన్ ప్రవర్తన మార్చుకోవడం లేదు.

Updated Date - Jun 19 , 2024 | 08:22 AM

Advertising
Advertising