ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Health Department: వైద్యశాఖ బదిలీల్లో భారీగా అక్రమాలు?

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:39 AM

వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో జరిగిన సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నాటి ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి.

  • ఇటీవలే ఓ విభాగాధిపతికి కూడా

  • పూర్తి ఆధారాలతో రంగంలోకి సర్కారు

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్యశాఖలోని వైద్యవిద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో జరిగిన సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న నాటి ఆరోపణలు ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయి. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో చేపట్టిన ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో తాజాగా మరో ఏడుగురికి ప్రభుత్వం చార్జి మెమోలు జారీ చేసింది. ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలోని ఓ కీలక విభాగాధిపతికి చార్జి మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా చార్జి మెమోలు రావడం వైద్య ఆరోగ్యశాఖలో కలకలం రేపుతోంది. ఈ ఏడాది జూలైలో వైద్య ఆరోగ్యశాఖలో సర్కారు సాధారణ బదిలీలు చేపట్టింది. ఆ బదిలీల్లో భారీగా మోసం జరుగుతున్నట్లు అప్పట్లోనే ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురించింది. ప్రధానంగా డీహెచ్‌ పరిఽధిలో స్టాఫ్‌ నర్సులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది బదిలీల జాబితాలో పెద్దయెత్తున గోల్‌మాల్‌ జరిగింది. రాత్రి విడుదల చేసిన ట్రాన్స్‌ఫర్‌ జాబితాలోని పేర్లు ఉదయానికి మారిపోయేవని ఉద్యోగులే ఆరోపించారు.


హైదరాబాద్‌లోని ప్రధానాస్పత్రుల్లో 15-20 ఏళ్లుగా పాతుకుపోయిన స్టాఫ్‌నర్స్‌లకు మళ్లీ అక్కడికే బదిలీ చేయడం వెనుక భారీగా డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలు వినిపించాయి. ఆ విభాగంలో కీలక అధికారికి ఉస్మానియా ఆస్పత్రిలో పనిజేసే ఇద్దరు నర్సులు బదిలీలకు సంబంధించిన డబ్బులు స్వయంగా వసూలు చేసి అప్పగించినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. బదిలీల వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని, కొందరికి కావాల్సిన చోట పోస్టింగ్స్‌ ఇస్తున్నారని ఆరోపిస్తూ నర్సులంతా ఏకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు. దీంతోపాటు యూనియన్‌ నేతల పేరిట పెద్దసంఖ్యలో కొందరు నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది బదిలీల నుంచి మినహాయింపు పొందారు. ఇందుకు అవసరమైన యూనియన్‌ లేఖలు ఇచ్చేందుకు ఒక్కొక్కరి దగ్గర రూ.2-3 లక్షల వరకు వసూలు చేశారు. అసలు యూనియన్స్‌లో పనిజేయని వారు కూడా పెద్దయెత్తున డబ్బులిచ్చి ఆ లేఖలు పొంది బదిలీల నుంచి మినహాయింపు పొందారు. బదిలీలల్లో జరిగిన అక్రమాలపై వైద్యమంత్రి దామోదర రాజనర్సింహకు పెద్ద ఎత్తున లిఖితపూర్వక ఫిర్యాదులండంతో ఇంటెలిజెన్స్‌ నివేదికలు తెప్పించుకున్నారు. దీనిపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించారు.


అదే సమయంలో ఓ ఐఏఎస్‌ అధికారిని దీనిపై విచారణ జరిపి నివేదికివ్వాలని సర్కారు ఆదేశించింది. అటు విజిలెన్స్‌, ఇటు ఐఏఎస్‌ అధికారి విచారణలో భాగంగా బదిలీల్లో అక్రమాలు జరిగినట్లు సర్కారుకు నివేదికలందాయి. దీంతో అక్రమాలకు పాల్పడిన వారికి వైద్యశాఖ నుంచి వరుసగా చార్జీ మెమోలు వస్తున్నాయి. తాజాగా డీహెచ్‌ కార్యాలయంలో పనిజేస్తున్న ఉద్యోగులు, ఉన్నతాధికారులకు కలపి ఒక రోజు నలుగురికి, మరొక రోజు మరో ముగ్గురికి చార్జీ మెమోలు వచ్చినట్లు వైద్యవర్గాలు ధ్రువీకరించాయి. అయితే ఇందులో కొందరికి సాధారణ బదిలీల్లో అక్రమాలకు పాల్పడినందుకు ఇవ్వగా మరికొందరికి మాత్రం గడిచిన రెండు నెలలల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యూటేషన్స్‌ ఇవ్వడం, ఉద్యోగులు సరెండర్‌ అయితే వారికి పోస్టింగ్స్‌ ఇవ్వడం, అనధికారికంగా డుమ్మా కొట్టిన వైద్యులకు పోస్టింగ్స్‌ ఇచ్చి భారీగా డబ్బులు దండుకున్న అంశాలపై చార్జి మెమోలిచ్చినట్లు తెలుస్తోంది.


  • ఆర్టీఐకూ సమాచారమివ్వని డీఎంఈ, డీహెచ్‌

డీఎంఈ, డీహెచ్‌ పరిఽధిలో సాధారణ బదిలీల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో పలువురు సమాచార హక్కు చట్టం కింద సమాచారం కోరారు. డీఎంఈ, డీహెచ్‌, తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలో జరిగిన వైద్యులు, స్టాఫ్‌నర్స్‌, ఇతర పారామెడికల్‌ సిబ్బంది బదిలీలు, ఎంతమందిని ట్రాన్స్‌ఫర్స్‌ చేశారు? యూనియన్‌ లేఖల పేరుతో బదిలీల నుంచి మినహాయింపు పొందిన ఉద్యోగుల వివరాలు కావాలని ఆ మూడు విభాగాధిపతులకు దరఖాస్తులు వచ్చాయి. ఇందుకు సంబంధించి ఒక్క తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు కమిషనర్‌ ఒక్కరే బదిలీలకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీఐ కింద సమాచార కార్యకర్తలకు పంపారు. కాగా డీఎంఈ, డీహెచ్‌ విభాగాధిపతులు మాత్రం అసలు బదిలీల సమాచారాన్ని ఆర్టీఐ కింద కోరడాన్నే తప్పుబట్టారు. ఇవి ఆర్టీఐ కింద ఇవ్వాల్సిన సమాచారం కాదని తిరస్కరించారు.


బదిలీలు అనేవి వ్యక్తిగత సమాచారం కిందకు వస్తుందని, కాబట్టి సమాచారం ఇవ్వబోమని డీఎంఈ, డీహెచ్‌ కార్యాలయాలు తేల్చి చెప్పాయి. దీంతో డీఎంఈ, డీహెచ్‌ పరిఽధిలో సాధారణ బదిలీల్లో భారీగా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు బలం చేకూరినట్లు అయింది. అలాగే తాజాగా ఓ విభాగాఽధిపతికి, ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలో మరి కొందరికి ఈ విషయంలో చార్జి మెమోలు జారీ కావడంతో అక్రమాలు జరిగినట్లు తేటతేల్లం అవుతోంది. ఇప్పటికే ప్రజారోగ్య సంచాలకుల పరిఽధిలోని బదిలీల అక్రమాలపై విచారణ జరగ్గా డీఎంఈ పరిఽఽధిలోని ట్రాన్స్‌ఫర్స్‌పై కూడా సమగ్ర విచారణ జరపాలని తాజాగా వైద్యవిద్య అధ్యాపకులు డిమాండ్‌ చేస్తున్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులను గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Nov 19 , 2024 | 02:39 AM