ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadadri Bhuvanagiri: సిమెంట్‌ ఫ్యాక్టరీ మాకొద్దు..

ABN, Publish Date - Oct 24 , 2024 | 03:56 AM

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పవద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టంచేశారు.

  • ‘గో బ్యాక్‌ అంబుజా’.. ప్రజల ఆందోళన

  • నిరసనల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ

  • యాదాద్రి జిల్లా రామన్నపేటలో ఉద్రిక్తత

  • తరలివచ్చిన పరిసర గ్రామాల రైతులు

  • అదనపు కలెక్టర్‌ను అడ్డుకున్న జనం

యాదాద్రి/నల్లగొండ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ పరిశ్రమను నెలకొల్పవద్దంటూ ప్రజలు ముక్తకంఠంతో స్పష్టంచేశారు. 63.8 ఎకరాల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఆ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో బుధవారం రామన్నపేటలో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రజల ఆందోళన, వారిని నిలువరించేందుకు పోలీసుల ప్రయత్నంతో ఉద్రిక్తత ఏర్పడింది. తమ ప్రాంతంలో సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయొద్దని, ‘అంబుజా గో బ్యాక్‌’ అంటూ ప్రజలు పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.


సమీపంలోని 10 గ్రామాల నుంచి యువకులు, మహిళలు, రైతులు ట్రాక్టర్లు, మోటారుసైకిళ్లపై తరలివచ్చి నిరసన తెలిపారు. కాలుష్యకారక సిమెంట్‌ ఫ్యాక్టరీని ఏర్పాటుచేస్తే చేతి, కుల వృత్తులు, వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. సదస్సుకు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలు స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు వెళ్లిపోవాలని స్థానికులు నినాదాలు చేయడంతో వారు తిరుగుముఖం పట్టారు. సదస్సు ముగిశాక అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) పి.బెన్‌షాలోంను ప్రజలు అడ్డుకున్నారు. ఫ్యాక్టరీని నెలకొల్పబోమని ఇప్పుడే ప్రకటించాలని పట్టుబట్టారు. వారిని పోలీసులు అడ్డుకుని.. అదనపు కలెక్టర్‌ను వాహనం ఎక్కించారు.


ఆ వాహనాన్ని ప్రజలు వెంబడిస్తూ ‘అంబుజా గో బ్యాక్‌’ అని నినాదాలు చేశారు. ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ప్రజల అంగీకారం లేకుండా పరిశ్రమను ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. సదస్సుకు బయలుదేరిన మాజీ ఎమ్మెల్యేలు రమావత్‌ రవీంద్రకుమార్‌, కంచర్ల భూపాల్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిషోర్‌ కుమార్‌, నోముల భగత్‌ను వేర్వేరుచోట్ల పోలీసులు అడ్డుకున్నారు. వీరిలో కొందర్ని గృహ నిర్బంధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆశించి రామన్నపేటలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీకి అనుమతి ఇచ్చిందని బీఆర్‌ఎస్‌ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు రమావత్‌ రవీంద్రకుమార్‌ ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


  • మోదీకి బీ-టీమ్‌గా.. రాష్ట్ర కాంగ్రెస్‌

  • అందుకే అదానీ అంబుజాకు సహకారం

  • మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపణ

హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ.. మోదీకి బీ-టీమ్‌గా పనిచేస్తోందని అందుకే రామన్నపేటలో అదానీ ఆధ్వర్యంలో అంబుజా సిమెంట్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సహకరిస్తున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. సిమెంట్‌ ఫ్యాక్టరీ వస్తే రామన్నపేట మండలం కకావికలం అవుతుందని, దాన్ని అడ్డుకుంటామన్నారు. ప్రజాభిప్రాయ ేసకరణ ప్రజల మధ్య కాకుండా దొంగచాటుగా జరపాలని ప్రయత్నం చేస్తున్నారన్నారు. తమ అభిప్రాయాలు చెప్పడానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌, ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేశారన్నారు. రేవంత్‌రెడ్డి పరిపాలనకు రోజులు దగ్గరపడ్డాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్ణయాలపై కోదండరామ్‌, హరగోపాల్‌ ఇప్పటికైనా గొంతు విప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Oct 24 , 2024 | 03:56 AM