ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kottagudem: అంబులెన్స్‌లో గంజాయి రవాణా..

ABN, Publish Date - Sep 16 , 2024 | 03:16 AM

అంబులెన్స్‌ను కూడా గంజాయి రవాణాకు వాడేశారు కొందరు కేటుగాళ్లు.. అయితే, ఆ వాహనం టైరు పంక్చర్‌ కావడంతో రూ.కోట్ల విలువ చేసే గంజాయి గుట్టురట్టయింది.

  • 2 కోట్ల విలువైన నాలుగు క్వింటాళ్ల సరుకు పట్టివేత

  • కొత్తగూడెంలో టైర్‌ పంక్చర్‌ కావడంతో బయటపడ్డ గుట్టు

చుంచుపల్లి, సెప్టెంబరు 15: అంబులెన్స్‌ను కూడా గంజాయి రవాణాకు వాడేశారు కొందరు కేటుగాళ్లు.. అయితే, ఆ వాహనం టైరు పంక్చర్‌ కావడంతో రూ.కోట్ల విలువ చేసే గంజాయి గుట్టురట్టయింది. అంబులెన్స్‌లో గంజాయి తరలిస్తున్న ఘటన కొత్తగూడెంలో వెలుగు చూసింది. ఓ అంబులెన్స్‌ టైర్‌ పంక్చర్‌ కావడంతో కొత్తగూడెంలోని రామవరం ప్రాంతంలో శనివారం అర్ధరాత్రి నిలిచిపోయింది.


అది గమనించి సాయం చేసేందుకు ముందుకొచ్చిన స్థానిక యువకులు.. వాకబు చేయగా పరిస్థితి అనుమానాస్పదంగా కనిపించింది. దీంతో వారు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు అంబులెన్స్‌లోని వ్యక్తిని ఎక్కడికెళ్తున్నావని.. ప్రశ్నించారు. దీంతో సదరు వ్యక్తి తడబడడంతో అనుమానించి వాహనంలో తనిఖీ చేయ గా... 4 క్వింటాళ్ల గంజాయి దొరికింది. దీంతో అంబులెన్స్‌ను, అందులోని వ్యక్తిని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.2 కోట్ల వరకు ఉంటుందని సమాచారం. కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

Updated Date - Sep 16 , 2024 | 03:16 AM

Advertising
Advertising