ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Amit Malviya: రేవంత్‌ ప్రభుత్వం టాలీవుడ్‌ను టార్గెట్‌ చేసింది

ABN, Publish Date - Dec 27 , 2024 | 03:51 AM

రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమ(టాలీవుడ్‌)ను టార్గెట్‌ చేసిందని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ఆరోపించారు.

  • బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ

న్యూఢిల్లీ, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలుగు చలన చిత్ర పరిశ్రమ(టాలీవుడ్‌)ను టార్గెట్‌ చేసిందని బీజేపీ ఐటీ సెల్‌ ఇన్‌చార్జి అమిత్‌ మాలవీయ ఆరోపించారు. టాలీవుడ్‌ నటులు, నిర్మాతలను నియంత్రించేందుకు, వారి నుంచి బలవంతంగా డబ్బును వసూలు చేసేందుకు సీఎం రేవంత్‌ చేసిన ప్రయత్నాలను వారు అడ్డుకోవడంతోనే రాష్ట్రప్రభుత్వం వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోందని అన్నారు. నాగార్జునకు చెందిన కన్వెన్షన్‌ కూల్చివేతతో ఈ వివాదం మొదలైందని, ఆయన మాజీ కోడలు, నటి సమంతపై ఓ మహిళా మంత్రి వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారని, మోహన్‌బాబు కుమారుడిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే ప్రచారం జరిగిందని తెలిపారు.


తాజాగా నటుడు అల్లు అర్జున్‌ చిక్కుల్లో పడ్డారని అన్నారు. టాలీవుడ్‌ సినీ ముఖ్యులు, ఫైనాన్సియర్లు సీఎంను కలవడానికి సిద్ధపడటంతో ఆయన ఒత్తిడి ఫలించినట్లు సంకేతాలు అందుతున్నాయన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా చెప్పుకోదగ్గ విజయాలేమీ సాధించని రేవంత్‌ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుందని అమిత్‌ మాలవీయ విమర్శించారు.

Updated Date - Dec 27 , 2024 | 03:51 AM