ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Andole: రమణీయం.. కమనీయం.. రంగనాథుడి రథోత్సవం

ABN, Publish Date - Jun 01 , 2024 | 04:12 PM

సంగారెడ్డి జిల్లా అందోల్‌ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు.

  • అందోల్ పుర వీధుల్లో మార్మోగిన శ్రీమన్నారాయణ స్మరణ

  • రథ ఊరేగింపు క్రతువు చివరి వరకూ పాల్గొన్న మంత్రి దామోదర, కుటుంబ సభ్యులు

  • 200 ఏళ్ల తరువాత అపూర్వ ఘట్టం

  • డోలు వాయిద్యాలతో, మంగళహారతులతో రంగనాథుడికి స్వాగతం పలికిన పురపాలిక ప్రజలు

  • అశేషంగా హాజరైన భక్తులు

అందోల్: సంగారెడ్డి జిల్లా అందోల్‌ పట్టణంలోని శ్రీ భూనీలా సమేత రంగనాథ స్వామి దేవాలయ(Andole Ranganatha Swami) వార్షిక బ్రహ్మోత్సవాలు కనులపండువగా జరిగాయి. శుక్రవారం అంగరంగ వైభవంగా రథోత్సవ కార్యక్రమం నిర్వహించారు. రథోత్సవంతో బ్రహ్మోత్సవాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఆలయం వద్ద నూతన రథాన్ని అందంగా అలంకరించి వేదపండితులు పూజలు నిర్వహించారు.

ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి మంత్రి సి.దామోదర రాజనర్సింహ(Damodar Rajanarsimha), పద్మిణి దంపతులు, త్రిష, మణికంఠ దంపతులు పూజలు చేశారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులు రథాన్ని ముందుకు లాగారు. మహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. పట్టణం మొత్తం జై శ్రీమన్నారాయణ నామస్మరణతో మార్మోగింది.


200 ఏళ్ల తర్వాత...

30 ఏళ్ల క్రితం రంగనాథుడి ఆలయంలో ఉన్న ఉత్సవ విగ్రహాలను వేరే ఆలయానికి తరలించగా మంత్రి చొరవతో ఇటీవలే వాటిని తిరిగి అందోల్ రంగనాథుడి చెంతకు చేర్చారు. ఆలయం కోసం మంత్రి రూ.20 లక్షలతో నూతన రథాన్ని చేయించారు. అలా 200 ఏళ్ల తరువాత మళ్లీ అందోల్(Andole) పట్టణంలో రథోత్సవం జరిగింది. వారం రోజులపాటు జరిగిన బ్రహ్మోత్సవాల్లో మంత్రి ప్రత్యేక పూజలు జరిపారు.


నూతన రథం 21 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పుతో కర్రతో దీనిని నిర్మించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్హాపూర్ మండలం పెంటవల్లి గ్రామానికి చెందిన బాలబ్రహ్మచారి ఈ రథాన్ని తయారు చేశారు. కార్యక్రమంలో ఆలయ పూజారి శ్యాంనాథ శర్మ, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు భవానీ నాగరత్నంగౌడ్, చిట్టిబాబు, భక్తులు అశేష సంఖ్యలో హాజరయ్యారు.

Andole: కనులపండువగా అందోల్ రంగనాథుడి బ్రహ్మోత్సవాలు.. పోటెత్తుతున్న భక్తులు

Andole: అందోల్‌లో దామోదర్ పర్యటన.. రంగనాథుడికి ప్రత్యేక పూజలు

Andole:అందోల్‌లో వెయ్యేళ్ల నాటి అద్భుత శిల్పాలు!

For Latest News and Telangana News click here

Updated Date - Jun 01 , 2024 | 04:48 PM

Advertising
Advertising