ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Amit Shah: అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డి అరెస్ట్

ABN, Publish Date - May 04 , 2024 | 01:26 PM

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరిట సోషల్ మీడియాలో అరుణ్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగానూ ఆయన పనిచేస్తున్నారు. పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో నిన్న రాత్రి అరుణ్‌ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు.

ఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ఫేక్ వీడియో కేసులో తెలంగాణకు చెందిన అరుణ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్పిరిట్ ఆఫ్ కాంగ్రెస్ పేరిట సోషల్ మీడియాలో అరుణ్ రెడ్డి యాక్టివ్‌గా ఉన్నారు. కాంగ్రెస్ సోషల్ మీడియా జాతీయ సమన్వయకర్తగానూ ఆయన పనిచేస్తున్నారు. పాటియాలా కోర్టు జడ్జి నివాసంలో నిన్న రాత్రి అరుణ్‌ను ఢిల్లీ పోలీసులు హాజరు పరిచారు. అరుణ్ రెడ్డిని మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి జడ్జి ఇచ్చారు. అరుణ్ రెడ్డిని అమిత్ షా ఫేక్ వీడియోపై ఢిల్లీ పోలీసులు విచారిస్తున్నారు. సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో అరుణ్ రెడ్డి ఫోన్లను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు.

Harish Rao: దేవుళ్ల మీద ఒట్టు పెడుతూ కొత్త డ్రామాకు తెర..


కాగా.. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్‌కు పాల్పడి వైరల్‌ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. టీపీసీసీ సోషల్‌ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీశ్‌తో పాటు ఆస్మా తస్లీం, అంబాల శివకుమార్‌, నవీన్‌, కోయ గీత, పెండ్యాల వంశీకృష్ణలు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. వీరంతా శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే‘ఫేక్‌ వీడియోకు సంబంధించి హైదరాబాద్‌ పోలీసులు కేసు నమోదు రని.. తిరిగి అవే ఆరోపణలపై ఢిల్లీ స్పెషల్‌ సెల్‌ పోలీసులు కేసు నమోదు చేసి మాకు నోటీసు జారీ చేశారని నిందితులు తెలిపారు. సీఆర్పీసీ సెక్షన్‌ 91/160 కింద జారీచేసిన ఈ నోటీసులను కొట్టేయాలి’ అని పేర్కొంటూ లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls: క్షీణించిన తేజస్వి యాదవ్‌ ఆరోగ్యం.. ఎన్నికలపై ప్రభావం చూపుతుందా..!

Phone Tapping Case: ప్రధాన నిందితుడు ప్రభాకర్‌ రావే... తేల్చేసిన పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 04 , 2024 | 01:26 PM

Advertising
Advertising