Batukamma festival: ఉద్యమంగా బహుజన బతుకమ్మ
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:33 AM
బతుకమ్మ పండుగ ఉత్సవం మాత్రమే కాదని ఉద్యమంలా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని ప్రజాగాయని విమలక్క పేర్కొన్నారు.
వెలివాడలో ఉత్సవాలు నిర్వహించాం.. బతుకమ్మ వేడుకల్లో విమలక్క వ్యాఖ్య
హైదరాబాద్/రవీంద్రభారతి, అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బతుకమ్మ పండుగ ఉత్సవం మాత్రమే కాదని ఉద్యమంలా బహుజన బతుకమ్మను నిర్వహిస్తున్నామని ప్రజాగాయని విమలక్క పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వెలివాడల్లో, నిరాకరించబడిన ప్రాంతాల్లో కూడా బతుకమ్మ ఆడించి చెరువులో నిమజ్జనం చేయించిన ఘనత బహుజన బతుకమ్మదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో బహుజన బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. బతుకమ్మ, పర్యావరణం, మహిళల భద్రత, చెరువుల పరిరక్షణ అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విమలక్క ప్రసంగించారు.
బతుకమ్మ పండుగ ప్రకృతితో ముడిపడి ఉందని, ప్రకృతిని ప్రేమించే ఏకైక పండుగ బతుకమ్మ అన్నారు. బతుకమ్మ అంటేనే బహుజనుల సంస్కృతని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ కార్యదర్శి వాణీప్రసాద్, మామిడి హరికృష్ణ పాల్గొన్నారు. కాగా, బతుకమ్మ సంబరాలు రాజ్‌భవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆయన భార్య సుధాదేవ్ వర్మ పాల్గొన్నారు. మంత్రులు సురేఖ, సీతక్క, సీఎస్ శాంతికుమారి హాజరయ్యారు.
Updated Date - Oct 10 , 2024 | 03:33 AM