ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandi Sanjay: కమీషన్ల కోసం రైతుల బలి

ABN, Publish Date - Nov 11 , 2024 | 04:38 AM

బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం బలి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు.

  • ధాన్యం సేకరణలో సర్కారు నిర్లక్ష్యం.. బోనస్‌ ఎగ్గొట్టేందుకు కొనుగోలు ఆలస్యం: సంజయ్‌

శంకరపట్నం/భీమదేవరపల్లి, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): బ్రోకర్ల నుంచి కమీషన్లు దండుకునేందుకు రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం బలి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. బోనస్‌ పైసలివ్వకుండా తప్పించుకోవడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం వడ్లు కొనుగోలు చేయకుండా జాప్యం చేస్తోందని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలను నేటికీ పూర్తిగా ప్రారంభించకపోవడం దారుణమన్నారు. కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సంజయ్‌ ఆదివారం సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం వడ్లకు క్వింటాకు రూ.2,300కు పైగా చెలిస్తోందని.. దీనికి రూ.500 బోనస్‌ చెల్లిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందని చెప్పారు.


ఈ సీజన్‌లో 50 లక్షల టన్నుల సన్న వడ్లకు రూ.500 చొప్పున రూ.2,500 కోట్ల బోనస్‌ చెల్లిస్తామని ప్రగల్భాలు పలికిందన్నారు. ఇప్పటి వరకు రైతులకు నయా పైసా బోనస్‌ ఇవ్వలేదని మండిపడ్డారు. బోనస్‌ సంగతి దేవుడెరుగు..? కొనుగోళ్లు లేక విసిగిపోయిన రైతన్నలు ఇప్పటికే 20 లక్షల టన్నుల వడ్లను మిల్లర్లకు అమ్ముకున్నారని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాత కాంగ్రెస్‌ సర్కారు విజయోత్సవాలు జరుపుకోవాలని చెప్పారు. రాష్ట్రంలోని ఆలయాలపై వరుస దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేవాలయాలపై దాడులు చేస్తున్న వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు.


  • రాకేశ్‌కు వైద్య ఖర్చులు అందిస్తా..

హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన వికలాంగ విద్యార్థి గూళ్ల రాకేశ్‌ వైద్యానికి అయ్యే ఖర్చులను భరిస్తానని బండి సంజయ్‌ హామీ ఇచ్చారు. గతంలో ఆంధ్రజ్యోతి దినపత్రికలో రాకేశ్‌పై వచ్చిన కథనంపై సంజయ్‌ స్పందించారు. ఆదివారం రంగయ్యపల్లిలో రాకేశ్‌ను కలిసి మాట్లాడారు. అతడికి త్రిచక్ర వాహనాన్ని అందిస్తానని చెప్పారు. అలాగే గ్రామంలో ఇటీవల పిడుగుపడి పెద్ద మొత్తంలో ఆస్తిం నష్టం జరిగిన ఓ కుటుంబాన్ని సంజయ్‌ పరామర్శించారు.

Updated Date - Nov 11 , 2024 | 04:38 AM