Bandi Sanjay: సొమ్ము కేంద్రానిది.. సోకు కాంగ్రెస్ సర్కార్‌ది
ABN, Publish Date - Nov 26 , 2024 | 03:53 AM
కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు.
‘ఉపాధి’ పనులతో విజయోత్సవాలు సిగ్గుచేటు: బండి
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం 90 శాతం నిధులు ఇచ్చే జాతీయ ఉపాధి హామీ పథకం పనులతో కాంగ్రెస్ ప్రభుత్వం తన ఏడాది పాలన విజయోత్సవాలను ప్రారంభించుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఏడాది పాలనలో చేసిందేమీ లేకపోవడంతో కేంద్ర నిధులతో అమలవుతున్న పనులను రాష్ట్ర ప్రభుత్వం తన పథకంగా ప్రచారం చేసుకుంటోందని ఆరోపించారు. సొమ్ము కేంద్రానిది, సోకు కాంగ్రెస్ ప్రభుత్వానిది అన్నట్లుగా ఉందన్నారు.
ప్రజా విజయోత్సవాల్లో భాగంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం జాతీయ ఉపాధి హామీ పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈ పథకం పనుల ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో ప్రధాని మోదీ ఫొటో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న పథకాలకు కూడా ప్రధాని ఫొటోను తప్పనిసరిగా ఉండేలా ఆదేశించాలని కోరారు.
Updated Date - Nov 26 , 2024 | 03:53 AM